రాజా ది గ్రేట్ సినిమాలో తన అందచందాలతో అందర్నీ కట్టిపడేసిన మెహ్రీన్ కౌర్ ఈరోజు తన 24వ పుట్టిన రోజును జరుపుకుంటున్నది. ఆమె నవంబర్ 5 1995 లో పంజాబ్ లోని భటిండా లో జన్మించారు. పదేళ్ల వయసులోనే రాంప్ వాక్ చేసిన ఈ భామ 'కసౌలి ప్రిన్సెస్' టైటిల్ ని గెలుచుకున్నారు. భరతనాట్యం లో కాకా ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో కూడా ఈమె దిట్ట.


తన మొదటి సినిమా అయినా 'కృష్ణగాడి వీరప్రేమగాధ' 2016 లో నాని సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. అది ఒకటే కాదు ఆమె నటించిన ప్రతి సినిమా ఒక హిట్టే అంటే నమ్ముతారా? 


ఈ పంజాబీ అమ్మాయి తెలుగులోనే కాదు తమిళ హిందీ బాషా సినిమాల్లో కూడా నటించారు. 2017 లో వచ్చిన సినిమా 'నెంజిల్ తునివిరుందల్' తో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది ఈ మిల్కీ బ్యూటీ. సందీప్ కిషన్ కధానాయకుడిగా నటించిన ఈ సినిమాలో కొన్ని కారణాల వలన మెహ్రీన్ నటించిన భాగాన్ని కట్ చేసారు. మెహ్రీన్ కౌర్ అనుష్క శర్మ నటించిన 'ఫిల్లరి' అనే హాస్యభరితమైన హిందీ సినిమాలో కూడా ఒక పాత్ర ని పోషించింది. 


ఇక తనకి బాగా పేరు తెచ్చి పెట్టిన సినిమాలేటంటే ఎఫ్2, మహానుభావుడు. మెగాబ్రదర్ నాగబాబు కుమారుడేనా వరుణ్ తేజ్ తో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ తన భిన్నమైన నటనతో ఎఫ్2 సినిమాని ఒక పెద్ద హిట్ చేసారు. మారుతి దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు సినిమాతో తెలుగు అభిమానులకి బాగా దగ్గరైంది. ఇక తన కుటుంబ విషయానికి వస్తే వాళ్ళ నాన్న ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ అమ్మ హౌస్ వైఫ్ బ్రదర్ మోడల్. తన తాత ఇండియన్ ఆర్మీ లో పనిచేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: