రాజకీయాలకు వివాదాలకు దూరంగా ఉండే మహేష్ కు శతృవులు ఎవరు ఉండరు. అయితే అలాంటి మహేష్ కు సెక్యూరిటీ నిమిత్తం కేంద్రప్రభుత్వం బులెట్ ప్రూఫ్ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఈ విషయాన్ని స్వయంగా ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నిర్మాత అనిల్ సుంకర ఈరోజు ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో ఆర్మీ మేజర్ గా నటిస్తున్న మహేష్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు కాశ్మీర్ ప్రాంతంలోని పహల్ గామ్ ప్రాంతంలో చిత్రీకరించవలసి వచ్చిందని అయితే అప్పటికే కాశ్మీర్ ప్రాంతంలో పరిస్థితులు ఏమీ బాగుండక పోవడంతో మొదట్లో తమ మూవీ షూటింగ్ కు అనుమతులు నిరాకరించిన విషయాన్ని వెల్లడించాడు.

అయితే ఆతరువాత తాను వ్యక్తిగతంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి ఈ మూవీ కథను వివరించి షూటింగ్ కు అనుమతులు కోరడంతో రాజ్ నాథ్ సింగ్ షూటింగ్ కు అనుమతి ఇవ్వడమే కాకుండా మహేష్ కు బద్రతా కారణాల రీత్యా బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరుటీని ఏర్పాటు చేసిన విషయాలను అనీల్ సుంకర వివరించాడు. అయితే ఇంత టెన్షన్ వాతావరణం ఉన్నా మహేష్ ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా అత్యంత ప్రమాదకరమైన పహల్ గామ్ ప్రాంతంలో షూట్ లో పాల్గొనడమే కాకుండా తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ఐదు గంటలకు షూట్ కు రెడీ అయిన విషయాలను వివరించాడు. 

అయితే తాము కాశ్మీర్ నుండి తరిగి వచ్చిన తరువాత మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు ప్రకటన చేసిందనీ ఇదే ముందు జరిగి ఉంటే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ షూటింగ్ కాశ్మీర్ లో తీయడం సాధ్యం అయి ఉండేది కాదు అంటూ అనీల్ సుంకర కామెంట్స్ చేస్తున్నాడు. దీనితో మహేష్ పడ్డ కష్టానికి చేసిన సాహసానికి ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: