‘డియర్ కామ్రేడ్’ తో ఊహించని షాక్ కు గురైన విజయ్ దేవరకొండను ఆమధ్య అతడు తీసుకున్న ఒక తెలివైననిర్ణయం మరొక భయంకరమైన ఫ్లాప్ విజయ్ దేవరకొండకుకు రాకుండా కాపాడింది అంటూ వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి గతవారం విడుదలైన ‘మీకు మాత్రమే చెప్తా’ కథను విజయ్ ని దృష్టిలో పెట్టుకుని తమిళ దర్శకుడు సమీర్ సుల్తాన్ వ్రాసినట్లు తెలుస్తోంది.

ఈకథ విజయ్ కి బాగా నచ్చడంతో మొదట్లో తాను హీరోగా చేస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆతరువాత విజయ్ సన్నిహితులు ఈకథ ఏమాత్రం విజయ్ కి నచ్చదు అని అనడంతో విజయ్ యూటర్న్ తీసుకుని తిరిగి సమీర్ సుల్తాన్ ను తన వద్దకు పిలిపించుకుని ఈమూవీలో తాను నటించనని అయితే తరుణ్ భాస్కర్ ను హీరోగా పెట్టి తాను ఈమూవీని నిర్మిస్తాను అని చెప్పడంతో వేరే మార్గం లేక సమీర్ విజయ్ చెప్పిన రాజీ మార్గానికి ఒప్పుకోక తప్పలేదు అన్నమాటలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఈవార్తలు ఇలా లీక్ అవ్వడంతో విజయ్ దేవరకొండ ఒక భయంకరమైన ఫ్లాప్ నుండి తప్పించుకున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇలా ఉంటే ఈమూవీ ద్వారా విజయ్ కు నష్టాలు రాకుండా ముగ్గురు వ్యక్తులు సహాయం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమా నిర్మాణ వ్యవహారాలు అన్నీ నిర్మాత మధుర శ్రీధర్ దగ్గర ఉండి చూసుకుని ఇంచుమించు నిర్మాత హోదాలో వ్యవహరించి చాలతక్కువ బడ్జెట్ లో ఈమూవీని తీయడానికి సహకరించినట్లు తెలుస్తోంది. 

అదేవిధంగా ఏషియన్ సునీల్ ఏరికోరి ఈమూవీని రెండున్నర కోట్లకు తెలుస్తోంది. వాస్తవానికి సినిమాలు కొనడంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తాడు అని పేరున్న సునీల్ కు ఈమూవీ ఎలా నచ్చింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే విజయ్ తో మంచి బంధాలు వున్న మైత్రీ మూవీస్ సంస్థ పూనుకుని ఈమూవీ విడుదలకు సహకరించడమే కాకుండా ముందే శాటిలైట్ అమ్మకాలు చేయించినట్లు తెలుస్తోంది. ఇలా ముగ్గురు వ్యక్తులు ప్రాపకం కోసం పనులు చేస్తూ ‘మీకు మాత్రమే చెప్తా’ విడుదలకు సహకరించి విజయ్ కు లాభాలు కలిగించి వారంతా నష్టపోయారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో జోక్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: