‘నాపేరు సూర్య’ అలాంటి దారుణమైన ఫ్లాప్ సినిమా తర్వాత చాలా టైమ్ తీసుకుని ‘అల వైకుంఠపురంలో’ అనే సినిమా చేస్తున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమాతో ఎలాగైనా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. గతంలో తన కెరియర్ లో 2 అతి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా తో హ్యాట్రిక్ విజయం సాధించాలని తెగ తాపత్రయ పడుతున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు అక్కినేని సుశాంత్ మరియు అదే విధంగా సీనియర్ హీరోయిన్ టబు నటిస్తుండటంతో సినిమా పై ఆసక్తి నెలకొంది. దీంతో టబు పాత్రకు సంబంధించిన ఫోటోను ఇటీవలే రిలీజ్ చేశారు. 


ఇందులో టబు అల్లు అర్జున్ అక్కగా నటిస్తున్నట్టు సమాచారం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఓ హైక్లాస్ ఇంటికి టబు వెళ్తుంది. అలా ఆ ఇంటికి వెళ్లిన టబుకు ఎదురైన సంగటనలు ఏంటి.. వాటిని బన్నీ ఎలా పరిష్కరించాడు అన్నది కథ అని తెలుస్తోంది. అక్క సెంటిమెంట్ తో సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలు సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మూడవ సాంగ్ మరియు సినిమా టీజర్ డైరెక్టర్ త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7వ తారీఖున విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్టు సమాచారం.


సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు విపరీతంగా ఉండటంతో..అలాగే విడుదలైన రెండు పాటలు అదరగొట్టడంతో రాబోతున్న మూడో పాట గురించి కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు స్టైలిష్ స్టార్ అభిమానులు మరియు సంగీత ప్రియులు. మరి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న తమన్ మూడో పాట కి ఏ ఏ విధంగా మ్యూజిక్ అందించారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: