టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ అతి చిన్న వయసులోనే ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఎన్టీఆర్ కు ఆ రేంజ్ హిట్ సినిమా మళ్లీ పడలేదు. మధ్యలో కొన్ని హిట్లు.. కొన్ని ఫ్లాపులు వచ్చినా ఎన్టీఆర్ కెరీర్లో సింహాద్రి అల్టిమేట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అని చెప్పాలి. రభస సినిమాకు ముందు వరకు వ‌రుస ప్లాపులు ఎదుర్కొన్న ఎన్టీఆర్ టెంప‌ర్‌ సినిమా నుంచి పూర్తిగా రూటు మార్చాడు.


టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ లాంటి వరుస హిట్లతో మంచి జోష్ మీదున్న ఎన్టీఆర్ కు అసలు సిసలైన రికార్డులు తిర‌గ‌రాసే సినిమా ఒకటి కావాలి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపైనే ఉంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ మ‌ళ్లీ రికార్డుల‌కు పాత రేసి కొత్త రికార్డులు రాస్తాడ‌ని అంటున్నారు.


ఈ సినిమాలో చరణ్ మరో హీరోగా నటిస్తున్నప్పటికీ రాజమౌళి - ఎన్టీఆర్ ఒక డెడ్లీ కాంబినేషన్. స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్‌, సింహాద్రి, య‌మ‌దొంగ సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు మ‌రోసారి ఈ కాంబినేష‌న్లో సినిమా వ‌స్తోంది. ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మరోసారి ఎన్టీఆర్ రికార్డుల లిస్టులో అగ్రభాగాన నిలవడం లాంఛనమేనని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఆర్.ఆర్.ఆర్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసినా అందులో రాజ‌మౌళితో పాటు మ‌రో హీరో చ‌ర‌ణ్‌కు కూడా వాటా ఇవ్వాల్సిందే అన‌డంలో ఎలాంటి డౌట్ లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: