కొరటాల శివ చిరంజీవిల కాంబినేషన్ లో
మూవీ ప్రారంభం కాబోతున్న వేళ ప్రస్తుతం మెగా అభిమానులకు కొన్ని సందేహాలు ఏర్పడుతున్నాయి. మొన్న జరిగిన ‘బిగ్ బాస్ 3’ షో ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన
చిరంజీవి తన లుక్ లో కొద్దిగా మోటుగా కనిపించడంతో పాటు మొఖంలోని బుగ్గలు బాగా ఉబ్బి ఉండటంతో మెగా అభిమానులు కొంత వరకు చిరంజీవిని లుక్ ను చూసి నిరుత్సాహ పడినట్లు వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు
చిరంజీవి ఇలాంటి లుక్ ను కొనసాగిస్తూ
కొరటాల మూవీలో కనిపిస్తాడా అన్న సందేహాలు మెగా అభిమానులను వెంటాడుతున్నట్లు టాక్. వాస్తవానికి ‘సైరా’ షూటింగ్ ముగిసిపోయిన తరువాత
చిరంజీవి కేరళ వెళ్ళి అక్కడ
ప్రకృతి ఆశ్రమంలో వైద్యం చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.
అంతేకాదు
కొరటాల మూవీ కోసం
చిరంజీవి డైటింగ్ లో ఉన్నాడు అని కూడ వార్తలు వచ్చాయి. అయితే డైటింగ్ చేస్తున్నప్పటికీ
చిరంజీవి శరీరం కంట్రోల్ కి రావడం లేదా లేదంటే మీడియాలో హడావిడి చేసిన ఈ వార్తలు అన్నీ అసత్యాల అంటూ మెగా అభిమానులు కొంత వరకు కలవర పడుతున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి
చిరంజీవి కొరటాల మూవీలో ద్విపాత్రాభినయం చేయవలసి ఉంది. అయితే ప్రస్తుతం
చిరంజీవి లుక్ లో వెంటనే మార్పులు వచ్చే పరిస్థితులు కనిపించక పోవడంతో
కొరటాల ముందు చూపుతో ఈ
మూవీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో వచ్చే యంగ్
చిరంజీవి పాత్రను
రామ్ చరణ్ చేత చేయిస్తున్నాడు అన్న అభిప్రాయాలు కూడ ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా ‘బిగ్ బాస్’ ఫైనల్స్ రోజున
చిరంజీవి లుక్ ను చూసిన మెగా అభిమానులు పూర్తిగా సంతృప్తి పడలేదు అన్న హడావిడి చేస్తూనే ఉన్నాయి. దీనితో ఈ కామెంట్స్
చిరంజీవి దృష్టి వరకు వెళితే తన లుక్ విషయంలో ఏమైనా మార్పులు చేసుకుంటాడేమో చూడాలి..