టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైతే మొదటి రోజు కలెక్షన్లు కొత్త రికార్డులు క్రియేట్ చేసేవి. గత కొంతకాలం నుండి రాజకీయాల్లో బిజీ కావటంతో సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్ అతి త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ ఇబ్బాయి సినిమాతో టాలీవుడ్ లో హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు. ఈ సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. 
 
పవన్ నటించిన గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి సినిమాలు హిట్ ఫలితాన్ని అందుకున్నాయి. 2001 సంవత్సరంలో ఎస్ జె సూర్య పవన్ కాంబోలో తెరకెక్కిన ఖుషి సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఖుషి తరువాత పవన్ నటించిన జానీ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. జానీ తరువాత పవన్ నటించిన గుడుంబా శంకర్ బిలో యావరేజ్ ఫలితాన్ని అందుకోగా బంగారం, అన్నవరం సినిమాలు యావరేజ్ ఫలితాన్ని అందుకున్నాయి. 
 
జల్సా సినిమాతో హిట్ కొట్టిన పవన్ ఆ తరువాత నటించిన కొమరం పులి సినిమా డిజాస్టర్ అయింది. తీన్ మార్ బిలో యావరేజ్ ఫలితాన్ని అందుకోగా పంజా సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. హరీష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గబ్బర్ సింగ్ తరువాత పవన్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. 
 
జల్సా తరువాత పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ కాగా గోపాల గోపాల అబవ్ యావరేజ్ హిట్ అయింది. పవన్ ఆ తరువాత నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ ఫలితాన్ని అందుకోగా కాటమరాయుడు యావరేజ్ హిట్ అయింది. అత్తారింటికి దారేది తరువాత పవన్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అజ్ఞాతవాసి డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. పవన్ కెరీర్లో జానీ, కొమరం పులి, పంజా, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి సినిమాలు డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్నాయి. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: