శ్రీరెడ్డి పేరు వింటే టాలీవుడ్ లో తెలియని ఒక భయం కలుగుతుంది.  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని, అవకాశాలు రావాలి అంటే మహిళా నటీమణులు కమిట్మెంట్ ఇవ్వాలని, ఈ సంస్కృతీ ఎప్పటి నుంచో ఇలా జరుగుతూనే ఉందని, కానీ, దాని గురించి ఎవరూ కూడా బయటపెట్టడం లేదని చెప్పి మొదటిసారి శ్రీరెడ్డి రోడ్డుపైకి వచ్చి నానా హంగామా చేసింది.  ఫిలిం ఛాంబర్ దగ్గర అర్ధనగ్నంగా కూర్చొని నిరసనలు వ్యక్తం చేసింది.  సెలేబ్రిటిల ఫోటోలను బయటపెడుతూ.. భయభ్రాంతులను చేసింది. 


టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి వాడుకొని చాలామంది తనను మోసం చేశారని చెప్పి మండిపడింది.  ఇప్పుడు టాలీవుడ్ నుంచి తన మకాంను చెన్నైకు షిఫ్ట్ చేసింది.  అక్కడ కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది.  సినిమాలు చేస్తున్నా.. కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీ రెడ్డి మాత్రం   ఎక్కడా తగ్గడం లేదు.  వారంతో ఎదోఒకరోజు ఈ విషయంపై శ్రీరెడ్డి తన సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తూనే వస్తున్నది.  


ఇక ఇదిలా ఉంటె, శ్రీరెడ్డిలో మరో కోణం కూడా ఉన్నది.  శ్రీరెడ్డి సామాజిక అంశాలపై కూడా ఎక్కువగా స్పందిస్తోంది.  అందుకు ఉదాహరణ ప్రవోలియన్ ఫ్యాషన్ షో.  శ్రీరెడ్డి ప్రవోలియన్ ఫ్యాషన్ షోలో తళుక్కున మెరిసింది.  ప్రవోలియన్ సంస్థ రైతుల ఆదుకోవడం కోసం షో నిర్వహిస్తోంది.  ఈ ఫ్యాషన్ షో ద్వారా వచ్చిన ఆదాయాన్ని రైతుల సంక్షేయం కోసం ఖర్చు చేస్తుంది.  


ఇది మంచి అంశం కాబట్టి ఇందులో పాల్గొనేందుకు శ్రీరెడ్డి ఉత్సాహం చూపించింది.  ఫ్యాషన్ షోలో శ్రీరెడ్డి ర్యాంప్ వాక్ చేసి ఔరా అనిపించింది.  అల్ట్రా మోడ్రన్ డ్రెస్ తో ఆమె రాంప్ పై వాక్ చేస్తూ మెరుపులు మెరిపించింది.  అల్ట్రా మోడ్రన్ డ్రెస్ లో శ్రీరెడ్డి టాప్ మోడల్స్ కు తాను తక్కువేమి కాదు అని నిరూపించింది శ్రీ రెడ్డి.  ఈ ఫ్యాషన్ షో లో శ్రీశాంత్, నిషా అగర్వాల్, హుమా ఖురేషి వంటి స్టార్స్ పాల్గొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: