‘డియర్ కామ్రేడ్’ పరాజయంతో పాటు విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ ఫెయిల్ అవ్వడంతో విజయ్ తన అంచనాలు ఇలా వరసపెట్టి తప్పిపోతూ ఉండటంతో తెగ టెన్షన్ పడిపోతున్నట్లు టాక్. దీనితో తన లేటెస్ట్ మూవీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ను విడుదల చేయడానికి ఒక సరైన డేట్ ను ఎంచుకోవడానికి కూడ విజయ్ విపరీతంగా భయపడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి క్రాంతి మాధవ్ చెప్పిన కథను విజయ్ ఒప్పుకున్న రోజులలో అతడు వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు పరాజయాలు వెంటాడుతున్న పరిస్థితులలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కు చాల రిపేర్లు చేయమని పట్టుపట్టడమే ఆ రిపేర్లు పూర్తి అయ్యాక మాత్రమే ఈ మూవీని విడుదల చేద్దామని అంటున్న పరిస్థితులలో ఈ మూవీకి సంబంధించి చాల సీన్స్ రీ షూట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు.

ఇప్పుడు అదే జరిగితే ఈ మూవీ ప్రాజెక్ట్ నుండి బయటకు రావడానికి విజయ్ కు కనీసం మరో మూడు నాలుగు నెలలు పట్టే ఆస్కారం ఉంది. అయితే ఇప్పటికే పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కోసం కథ రెడీ చేసి వచ్చేజనవరి నుండి ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించాలని అన్ని ప్లాన్స్ పూర్తి చేసాడు. 

ఇప్పుడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రీ షూట్ మొదలుపెడితే విజయ్ ఫిబ్రవరి వరకు ఆ మూవీతోనే ఉండిపోయి ఆ తరువాత పూరీ సినిమా కోసం తన లుక్ ను మార్చుకుని రెడీ కావడానికి మార్చి నెల వస్తుంది అని అంటున్నారు. దీనితో ఇప్పటికే రెడీ అయిపోయిన పూరీ జగన్నాథ్ ని వదులుకోలేక పూర్తిగా తనకు నచ్చని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేక విజయ్ దేవరకొండ విపరీతమైన టెన్షన్ పడిపోతున్నాడు అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: