వైఎస్ జగన్ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఆయనకు సపోర్ట్ గా ఏ సినీ తారలు ప్రచారం చేయలేదు.  పెద్ద స్టార్స్ ఎవరూ కూడా ముందుకు రాలేదు.  అలానే జగన్ విజయం సాధించిన తరువాత కూడా ఎవరూ ముందుకు వచ్చి అభినందనలు చెప్పలేదు.  దీంతో కమెడియన్ పృద్వి ఇండస్ట్రీలోని నటీనటుల గురించి కామెంట్స్ చేశాడు.  జగన్ గెలవడం ఎవరికీ ఇష్టం లేదని చెప్పడంతో... ఎందుకొచ్చిన గొడవలే అని చెప్పి ఒక్కొక్కరుగా వెళ్లి ఆయన్ను కలిసి అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు.  


ఇటీవలే మెగాస్టార్ కూడా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపాడు.  జగన్ ఇంట్లో ఆతిధ్యం స్వీకరించాడు.  ఆ తరువాత కొందరు నటులు వెళ్లి జగన్ ను కలవడం అభినందలు తెలియజేయడం షరా మామూలైంది.  తాజాగా టాలీవుడ్ స్టార్ దర్శకుడు వివి వినాయక్ ఆంధ్రప్రదేశ్ వెళ్లి జగన్ ను కలిశాడు.  జగన్ ను కలిసి ఘనంగా సత్కరించాడు.  జగన్ ను మర్యాదపూర్వకంగానే కలిసినట్టు వార్తలు వస్తున్నాయి.  


కానీ, విషయం అదికాదని, వినాయక్ కు రాజకీయాల పట్ల మంచి అవగాహనా ఉన్నది.  తన జిల్లాలో వినాయక్ కు పట్టు ఉన్నది.  ఒకవేళ అవకాశం దొరికితే వినాయక్ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారని, అందుకే అడ్వాన్స్ గా జగన్ ను కలిసి వచ్చారని కొందరు అంటున్నారు.  ఎవరు ఎలా అనుకున్నా... ప్రస్తుతానికైతే వినాయక్ జగన్ ను మర్యాదపూర్వకంగానే కలిసారని, అంతకు మించి మరొకటి లేదని అంటున్నారు.  


ఆది, దిల్,  చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, అదుర్స్, ఖైదీ నెంబర్ 150 వంటి ఎన్నో మంచి సినిమాలకు దర్శకత్వం వహించిన వినాయక్ ఇప్పుడు హీరోగా మారి శీనయ్య సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం.  దిల్ సినిమాతో రాజుకు మంచి హిట్ ఇచ్చి దిల్ రాజుగా మార్చిన వినాయక్ కు రిటర్న్ గిఫ్ట్ కింద వినాయక్ ను సీనయ్య సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: