సంక్రాంతి సినిమాల హంగామా ఈసారి చాల ముందుగా ప్రారంభం అవుతోంది. ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ మూవీ పాటల హడావిడి కొనసాగుతూ ఉంటే ఇప్పుడు ఆ హడావిడిలో రజినీకాంత్ ‘దర్భార్’ కూడ వచ్చి చేరింది. 

ఈరోజు సాయంత్రం ‘దర్బార్’ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ మురగదాస్ చేసిన ట్విట్ మెగా అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించిది. ‘దర్బార్’ మూవీకి సంబంధించిన తెలుగు వెర్షన్ మోషన్ పోస్టర్ లను ఆయా భాషల సినిమా రంగాలకు చెందిన సూపర్ స్టార్స్ రిలీజ్ చేయబోతున్నారు అంటూ మురగదాస్ ఒక ట్విట్ చేసి ఈ మూవీ తెలుగు మోషన్ పోస్టర్ ను కమలహాసన్ ఈరోజు సాయంత్రం విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు.

ఇప్పుడు ఈ ప్రకటన మెగా అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు సినిమా రంగానికి సంబంధించిన సూపర్ స్టార్ లేదా మెగా స్టార్ స్థానం ఒక్క చిరంజీవికి మాత్రమే సొంతం అనీ అలాంటిది మురగదాస్ కమలహాసన్ ను తెలుగు సినిమా రంగానికి సూపర్ స్టార్ గా ఎలా గుర్తించారు అంటూ మెగా అభిమానులు మురగదాస్ ను టార్గెట్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి చిరంజీవి రజినీకాంత్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఈమధ్య చెన్నైలో ‘సైరా’ ను ప్రమోట్ చేస్తూ చిరంజీవి రజినీకాంత్ రాజకీయాలకు పనికిరాదు అంటూ ఒక షాకింగ్ కామెంట్స్ చేసాడు. దానిపై పెద్ద దురామే రేగింది. దీనితో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మురగదాస్ ఇలా చిరంజీవిని పక్కకు పెట్టాడా లేదంటే చిరంజీవి అమెరికా వెళ్ళాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో చిరంజీవి అందుబాటులో లేకపోవడంతో చిరంజీవి స్థానంలో కమలహాసన్ ను దింపి అతడిని తెలుగు సినిమా సూపర్ స్టార్ గా మార్చాడా అన్న విషయమై సమాధానం మురగదాస్ కే తెలియాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: