ప్రయోగాలు చేసే దర్శకుల్లో ముందు వరసలో ఉండే వ్యక్తి సింగీతం శ్రీనివాసరావు.  అయన తీసిన సినిమాలు అన్ని ప్రయోగాత్మకంగానే ఉంటాయి.  కమల్ హాసన్ తో అమావాస్య చంద్రుడు, మాటలు లేని మూకీ సినిమా పుష్కక విమానం, విచిత్ర సోదరులు.. ఇలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి.  మాటలు లేకుండా మూకీగా మనిషి నవ్వించడం అంటే మాములు విషయం కాదు.  చాలా కష్టపడాలి.  కష్టంతో కూడుకొవడమే కాదు.. ఏదైనా తేడా వస్తే సినిమా మొత్తం ఫెయిల్ అవుతుంది.  


కానీ, కమల్ హాసన్ ఎక్కడ తడబడకుండా సినిమాను అద్భుతంగా పూర్తి చేశాడు.  సింగీతం పక్కా స్క్రీన్ ప్లే వర్కౌట్ అయ్యింది.  ఇప్పటికి ఈ సినిమా ఎవర్ గ్రీన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇదిలా ఉంటె,  సింగీతం దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా విచిత్ర సోదరులు.  ఈ సినిమా భారీ హిట్ కొట్టింది.  ఇందులో ఇద్దరు కమల్ హాసన్లు ఉంటారు.  అందులో ఒకరు పొట్టిగా ఉంటాడు.  కమల్ హాసన్ పొట్టిగా చూపించడం అంటే ఎలా.. ఇప్పుడంటే గ్రాఫిక్స్ వచ్చాయి సరిపోతుంది.  కానీ, అప్పట్లో గ్రాఫిక్స్ లేదు.. కెమెరా ట్రిక్స్ తో మాత్రమే మేనేజ్ చేయాలి.  


ప్రతి షాట్ ను చాలా జాగ్రత్తగా ముందుగా ప్లాన్ చేసుకోవాలి.. నడిచే విధానం, సోఫాలో కూర్చునే విధానం.. సాంగ్స్ లో డ్యాన్స్ చేసే సమయంలోను ఇలాంటి ఎన్నో ఉన్నాయి.  అక్కడ కమల్ హాసన్ ను పొట్టిగా చూపించడానికి సింగీతం పడిన శ్రమకు జపాన్ అనే వ్యక్తి తోడు కావడంతో పక్కాగా వర్కౌట్ అయ్యింది.  జపాన్ అనే సెట్ బాయ్ కమల్ పొట్టిగా కనిపించడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.  ప్రతి విషయంలో  అతను అంగరక్షకుడిగా ఉండి సినిమా పూర్తవ్వడానికి సహకరించాడు.  


సెట్ బాయ్ ఏదో అలా వచ్చి తన పని తాను చేసుకొని వెళ్లిపోకుండా.. సినిమా తనదిగా భావించి... సినిమా కోసం కష్టపడి చేసిన తీరు మెప్పించింది.  అందుకే సినిమా విజయోత్సవ సభలో కమల్ హాసన్ ఈ విషయం గురించి మాట్లాడాడు.  సెట్ బాయ్ జపాన్ లేకుంటే.. అసలు షూటింగ్ జరిగేది కాదని, సినిమా పూర్తి చేసేవాళ్ళం కాదని కమల్ హాసన్ చెప్పడం విశేషం.  అదండీ పొట్టి కమల్ హాసన్ కథ.  


మరింత సమాచారం తెలుసుకోండి: