పూనమ్ కౌర్ తరుచు చేసే ట్విట్స్ లో పరోక్షంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఉంటుంది. ఈమధ్య పవన్ కళ్యాణ్ ‘లాంగ్ మార్చ్’ కి పిలుపు ఇచ్చినప్పుడు ఆమె చేసిన పలు ట్విట్స్ పవన్ ను టార్గెట్ చేసేవిగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర అసహనానికి లోనయ్యారు.

అలాంటి పూనమ్ కౌర్ కు పాకిస్థాన్ నుండి ఆహ్వానం అందింది. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి ఈ నెల 12న జరగబోతోంది. ఈ సందర్భంలో గురునానక్ పుట్టిన ప్రాంతమైన పాకిస్థాన్ లోని కర్తర్ పూర్ కారిడార్ ప్రాంతానికి పూనమ్ కౌర్ వెళ్ళబోతోంది. 

సిక్కు మతానికి చెందిన పూనమ్ కౌర్ బయటకు చాల మోడ్రన్ గా కనిపించినా సిక్కు మత సాంప్రదాయాలను చాల నిష్టగా పాటిస్తూ సిక్కులు పరమ పవిత్రంగా భావించే గురుద్వారా ను శుభ్రం చేసే కార్యక్రమాలలో ఆమె తరుచు పాల్గొంటూ మానసిక ప్రసాంతతను పొందడం పూనమ్ కౌర్ కు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. ఆమె పాకిస్థాన్ కు ఈ విషయమై వెళ్ళడానికి సంబంధించిన వీసా క్లియర్ అయిన సందర్భంలో తన ఆనందాన్ని వ్యక్త పరుస్తూ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ప్రస్థుతం ఇండియా పాకిస్థాన్ ల మధ్య సంబంధాలు ఏమాత్రం బాగాలేని పరిస్థితులలో తనకు వీసా క్లియర్ కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అయితే తాను కేవలం ఒక యాత్రికురాలిగా మాత్రమే పాకిస్థాను వెళుతున్నాను కాని ఇండియా పాకిస్థాన్ సంబంధాలకు తన యాత్రకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పింది. అయితే తాను పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను కలవడానికి ప్రయత్నిస్తానని ఎన్ని వైరుధ్యాలు ఉన్నా ఇండియా పాకిస్థాన్ ప్రజలు శాంతిని కోరుకుంటున్న విషయాన్ని తాను ఆయనకు వివరిస్తానని పూనమ్ కపూర్ చెపుతోంది..
 



మరింత సమాచారం తెలుసుకోండి: