సాధారణంగా ఒక టాప్
హీరో మరొక
హీరో చేసిన ఫెయిల్యూర్ ప్రయోగాన్ని అనుసరించడానికి ఇష్టపడడు. అయితే ఇప్పుడు
అల్లు అర్జున్ నాని ఫెయిల్యూర్ ప్రయోగాన్ని రిపీట్ చేయబోతు ఉండటం
ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఎక్కువగా
తెలంగాణ ప్రాంత యాసలో మాట్లాడటానికి చాలామంది హీరోలు ప్రయత్నాలు చేస్తూ అనేక హిట్స్ కూడ కొడుతున్నారు. అయితే
రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన చిత్తూరు
జిల్లా యాసతో డైలాగ్స్ చెప్పి హిట్ కొట్టాలని
నాని కృష్ణార్జున యుద్దంలో ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నం వికటించింది.
ఇప్పుడు మళ్ళీ
అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కాబోతున్న మూవీలో బన్నీ చిత్తూరు యాసతో డైలాగ్స్ చెప్పబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి
సుకుమార్ సూచనతో బన్నీ చిత్తూరు యాసను నేర్చుకోవడానికి ఒక ప్రత్యేకమైన ట్యూటర్ ను పెట్టుకుని కూడ చాల కష్టపడుతున్నట్లు సమాచారం. ఈ
మూవీ కథ అంతా చిత్తూరు జిల్లాలలోని శేషాచలం అడవులలో జరిగే గందపు చెక్కల స్మగ్లింగ్ చుట్టూ తిరిగే నేపధ్యంలో బన్నీ మాటతీరుతో పాటు బాడీ లాంగ్వేజ్ కూడ చిత్తూరు ప్రాంతంలోని వారిని పోలి ఉండేలా
సుకుమార్ డిజైన్ చేస్తున్నట్లు టాక్.
అంతేకాదు సహజత్వం కోసం ఈ మూవీలో నటించే కొంతమంది నటీనటులను చిత్తూరు ప్రాంతంలోని వర్థమాన నటులను ఎంపిక చేసి వారికి ఇప్పటికే
సుకుమార్ ట్రైనింగ్ కూడ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కాబోతున్న పరిస్థితులలో ఈ
మూవీ కోసం బన్నీ రఫ్ గా కనిపించడానికి తన లుక్ ను మార్చుకోవడమే కాకుండా గుబురు గెడ్డం కూడ పెంచుకోబోతున్నాడని టాక్. దీనితో
నాని ఏ ప్రయోగంలో ఫెయిల్ అయ్యాడో అక్కడే ప్రయత్నిస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..