విలక్షణ నటుడు కమల్ హాసన్ వయస్సు 65 సంవత్సరాలే అయినప్పటికీ కమల్ చాలా చిన్న తనంలో తన 5వ ఏట నుండే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలలోకి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా కమలహాసన్ చేసిన ప్రయోగాలు ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు చేసి ఉండరు. ఈమధ్యనే కమల్ 60 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు.  

ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి తమిళనాడులోని అతడి స్వగ్రామంలో మూడు రోజుల పాటు వేడుకులు చేసుకున్నాడు. ఈ వేడుకలకు కమలల్ హాసన్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను కమలహాసన్ కూతురు శృతిహాసన్ సోషల్ మీడియాలో పెట్టింది. ఈ ఫోటోలలో కమల్ అన్నయ్య చారుహాసన్ సుహాసినీ మణిరత్నం కూతుళ్ళు శృతి అక్షర ఇతర కుటుంబ సభ్యులతో పాటు హీరోయిన్‌ పూజా కుమార్ కనిపించడం హాట్ న్యూస్ గా మారింది. 

ఈమె కమలహాసన్ విశ్వరూపం మూవీలో నటించడమే కాకుండా ఈమె రాజశేఖర్ తో ‘గరుడవేగ’ మూవీలో కూడ నటించింది. దీనితో కమల్‌ తో స్నేహం కారణంగానే ఆమె ఆ ఫోటోలో ఉందా ? లేక కమల్‌ తో ఆమె ప్రస్తుతం సహా జీవనం చేస్తోందా అన్న సందేహాలు ఈ ఫోటోలను చూసిన చాల మందికి ఈ సందేహాలు కలుగుతున్నాయి.  

కమల్ ఇప్పటికే వాణి గణపతి ఆ తారువాత సారికలను పెళ్ళాడి ఆ పై విడిపోయిన తరువాత నటి గౌతమితో సహా జీవనం చేసిన విషయం తెలిసిందే. అయితే కమల్ గౌతమిల బంధం కూడ విడిపోయింది. దీనితో కమల్ జీవితంలోకి లేటెస్ట్ గా పూజ కుమార్ ఎంటర్ అయిందా అంటూ కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. కమల్ హాసన్ ఏమి చేసినా ఎలా చేసినా అది సంచలనమే కాకుండా మీడియాకు హాట్ న్యూస్ గా మారుతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: