ఉద్దేశం ఏదైనా.. సినిమాలు తీసే దర్శక నిర్మాతలు కోరుకునేది లాభాలు మాత్రమే.... అందుకే
సినిమా అంటేనే బిజినెస్ తర భాషల్లో తీసే సినిమాల మాదిరిగా మన నిర్మాతలు తెలుగు సినిమాలను రూపొందించరు మనకి
సినిమా పరంగా కొన్ని నియమాలు, పరిమితులు ఉంటాయి. ఆ
సినిమా పరిమితులకు లోబడి తీసిన చిత్రాలకు ప్రేక్షకులు ఆమోద ముద్ర వేస్తూ.. చిరస్మరణీయ విజయాలను అందిస్తున్నారు.
కానీ కొందరు మీడియం, లో బడ్జెట్ నిర్మాతలు.. వారి స్వలాభం కోసం
టాలీవుడ్ పరిమితులను పక్కన పెట్టి.. కొన్ని నాసిరకమైన బీ, సీ గ్రేడ్ సినిమాలు తీస్తుండటం సర్వ సాధారణం అవుతోంది. అవసరానికి మించిన ముద్దు సీన్లు – హీరొయిన్ చేత పదే పదే ఎక్స్ పోజింగ్ చేయించే సీన్లు రాసుకోవడం – బెడ్ రూమ్ లో ప్రైవేటుగా నడిపించాల్సిన శృంగారాన్ని బోల్డ్ నెస్ పేరుతో మొహమాటం లేకుండా తెరమీద చూపించేయడం ఇటీవల కాలంలో బాగా ఎక్కువైపోయింది.ఇక ఇలాంటి సినిమాలు తీసేవారి లక్ష్యం కేవలం డబ్బులు సంపాదించాడం అనేది పట్టించుకుంటారు తప్ప.. ఈ సినిమాల ప్రభావం యువతపై ఎలా ఉంటుందో అన్నది పట్టించుకోరు.
కథానుసారంగా వచ్చే శృంగార సన్నివేశాలు, బోల్డ్ సీన్స్‌ను తీయలేం. ‘ఆర్ఎక్స్100’ ‘అర్జున్ రెడ్డి’ వంటి చిత్రాలు ఎంత పెద్ద విజయాలు సాధించాయో అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రాల్లో కావాల్సినన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. అయితే అవి కథానుసారంగా వస్తాయి తప్ప.. కావాలని జొప్పించినవి కావు. ఇదే అదునుగా చిన్న నిర్మాతలు కేవలం శృంగార సన్నివేశాలతో చిత్రాలను రూపొందించి.. మాది కల్ట్ క్లాసిక్ అని చెప్పుకుంటూ యువతను తప్పుదోవ పట్టిస్తుంటారు. ఇక వీటికి సంబంధించిన ట్రైలర్లు, టీజర్లు టీవీలో వచ్చేటప్పుడు చిన్న పిల్లలు అక్కడ లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెచ్యూరిటీ పేరిట అర్ధంలేని సినిమాలు తీస్తే వాళ్లకు నాలుగు డబ్బులు రావచ్చేమో గానీ...ఇదే పద్దతిని ఫాలో అయితే రేపటి తరం యువత తమ కెరీర్లను నాశనం చేసుకునే పరిస్థితి వస్తుంది. పోనీ దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు మారతారని అనుకుంటే అది మన తెలివి తక్కువ తనమే అని చెప్పవచ్చు.
కంటెంట్ తక్కువ.. బోల్డ్నెస్ ఎక్కువగా ఫస్ట్ లుక్, టీజర్ల పేరుతో ప్రోమోలు విడుదల చేసి అందులో మోతాదుకు మించిన శృంగార సన్నివేశాలను మేళవించి.. చూడడానికే జిగుప్స కలిగించేలా చేస్తున్నారు. అంతేకాకుండా వాటి టైటిల్స్ కూడా అసభ్యకరంగా ఉంటున్నాయి. వీటికి సెన్సార్ బోర్డు ఉన్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఈ పోకడ మరింత ఎక్కువైంది. ఒకటో అరో సృజనాత్మకతకు, కళాత్మకతకు అద్దం పట్టే సినిమాలు వస్తున్నా… అవి అవార్డులకే పరిమితమవుతున్నాయి. అభివృద్ధి చెందిన
టెక్నాలజీ నేపథ్యంలో మంచి కంటే చెడు ఎక్కువగా ప్రభావం చూపుతున్న దృష్ట్యా ఇలాంటి సినిమాలు మరుగున పడిపోతున్నాయి. కొందరిని మినహాయిస్తే.. చాలావరకు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఏది ఏమైనా
టాలీవుడ్ ఇండస్ట్రీ చాలావరకు బీ, సీ సెంటర్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రెస్‌గా మారిపోతుండటం నిర్వివాదాంశం.