గజినీ సినిమా నుంచి తెలుగులో కూడా తమిళ స్టార్ హీరో సూర్యకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయన సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ బాగా ఉంది. అందుకే తమిళంలో ఆయన హీరోగా నటించే ప్రతి సినిమాను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తుంటారు. అయితే ఈ ఏడాది రెండు సినిమాలతో సూర్య ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒకటి ‘ఎన్జీకే’, మరొకటి ‘బందోబస్త్’. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి సూర్య. అందుకే ఇప్పుడు మరో కొత్త సినిమాతో సూర్య తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైపోయాడు.


తెలుగులో విక్టరీ వెంకటేష్‌తో ‘గురు’ లాంటి మంచి సినిమాను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ప్రస్తుతం ఒక చిత్రం చేస్తున్నారు. తమిళంలో ‘సూరరై పోట్రు’ టైటి‌ల్‌ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ అనే టైటిల్‌ తో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో అపర్ణ బాల మురళి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ను నేడు విడుదల చేశారు. తెలుగు, తమిళ ఫస్ట్‌లుక్ పోస్టర్లను హీరో సూర్య ట్వీట్ ద్వారా తన ఖాతాలో ట్విట్ చేశారు. ‘‘అసాధారణమైన కలతో ఒక సాధారణ వ్యక్తి’’ అని సూర్య ట్వీట్‌లో ఈ చిత్రాన్ని పేర్కొన్నారు.


కాగా, ఈ సినిమాకు సూర్యనే నిర్మాత, సిఖ్యా ఎంటర్‌టైన్మెంట్ సౌజన్యంతో 2డి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ పై సూర్య ఈ సినిమాను నిపనులు చేపడుతున్నాడు. రాజశేఖర్ కర్పూర పాండియన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సూర్తి సహ నిర్మాతలు. ఇంకా ఈ సినిమాకి నికేత్ బొమ్మి సినిమాటో గ్రఫీ అందిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. కాళీ వెంకట్, కరుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న, కృష్ణ కుమార్ తదితరుల తారాగణం ఇందులో నటిస్టున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: