శంకర్ ఒకప్పుడు సౌత్ లో టాప్ దర్శకుడు. అయన
సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూసేవారో చెప్పక్కర్లేదు. ప్రేమికుడు, జెంటిల్ మెన్ సినిమాల నుంచో రోబో వరకు ఈ హవా కొనసాగింది. కానీ, ఇప్పుడు ఎందుకో ఈ హావా పెద్దగా కొనసాగడం లేదు. హిందీలో వచ్చిన 3 ఇడియట్స్ సినిమాను
రీమేక్ చేసిన తరువాత
శంకర్ కు కాలం కలిసిరావడం లేదు. ఆ తరువాత వచ్చిన ఐ
సినిమా అడ్రెస్ లేకుండా పోయింది.
కథపై కాకుండా కేవలం సాంగ్స్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. సినిమాలో సాంగ్స్ సూపర్బ్ గా ఉంటాయి అందులో సందేహం అవసరం లేదు. డబ్బింగ్
సినిమా అయినప్పటికీ తెలుసులో ఆ
సినిమా సాంగ్స్ సూపర్. ఈ
మూవీ తరువాత
రజినీకాంత్ తో చేసిన 2.0
సినిమా కూడా పెద్దగా లేదని చెప్పాలి. సినిమాలో అంతా బాగుందిగాని, ఎదో మిస్ అయ్యిందని అందరికి అనిపించింది. రోబోలో ఉన్న ఫీల్, ఈ సినిమాలో కనిపించలేదు. అందుకే
శంకర్ ఈ
సినిమా ద్వారా ఏం చెప్పాలి అనుకున్నాడో దానిని క్యారీ చేయలేకపోయాడు.
ఇదిలా ఉంటె,
శంకర్ ఇప్పుడు భారతీయుడు సీక్వెల్
సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్నారు సౌత్ ప్రజలు.
కమల్ హాసన్ హీరోగా చేస్తున్న
సినిమా ఇది. అప్పట్లో వచ్చిన భారతీయుడు
సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ
సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని అనుకుంటున్నారు. అయితే,
శంకర్ ఈ సినిమాను ఎలా తీస్తున్నాడు అన్నది తెలియాలి. మరోవైపు లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ
సినిమా కోసం బడ్జెట్ విషయంలో చాలా కండిషన్స్ పెట్టింది.
ఈ కండిషన్స్ ను తట్టుకొని
శంకర్ ఏ మేరకు సినిమాను తీస్తున్నారో తెలియాలి. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన ఈ
సినిమా ఎందుకో ఆలస్యం అయ్యింది. కారణాలు ఏవైనా కావొచ్చు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అనుకుంటే
శంకర్ సినిమా కాబట్టి ఆలస్యం అవుతుంది.
సినిమా ఎలా ఉన్నా ప్రతి ఫ్రేమ్ లో కూడా లుక్స్ అద్భుతంగా ఉంటాయి. ఫ్రేమ్ లో ఎదో
మాయ చేస్తాడు. అందుకే అయన సినిమాలు కొన్ని ఫెయిల్ అయినా.. ఆ ఇది తగ్గడం లేదు.