స్టార్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఓ భారీ మాస్ యాక్షన్ సినిమా సెట్స్ కు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం బాల‌య్య కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూర‌ల్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే బాల‌య్య బోయ‌పాటితో జాయిన్ అవుతాడు.


సినిమా ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే బాల‌య్య‌కు హీరోయిన్‌ను సెట్ చేయ‌డం బోయ‌పాటికి పెద్ద స‌వాల్‌గా మారింది. బాల‌య్య - బోయ‌పాటి సెంటిమెంటు ప్రకారం .. ఇంతకుముందు లానే ఇద్దరు కథానాయికలు ఇందులోనూ నటిస్తారట. అయితే ఇప్పుడు ఇద్ద‌రు హీరోయిన్లు కాదు క‌దా... క‌నీసం ఒక్క హీరోయిన్ కూడా దొర‌క‌డం లేద‌ట‌.


బోయపాటి అటూ ఇటూ ఆలోచించి ఓ హీరోయిన్ గా 27 ఏళ్ల కన్నడ బ్యూటీ రచిత రామ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపించింది. ఆమె క‌న్న‌డ‌లో బిజీ హీరోయిన్. ఆమె వ‌య‌స్సు 27... ఇటు బాల‌య్య కాస్త అటూ ఇటూగా 60కు ద‌గ్గ‌ర్లో ఉన్నాడు. వీరిద్ద‌రి మ‌ధ్య 33 ఏళ్ల గ్యాప్ అంటే మామూలు విష‌యం కాదు. రీజ‌న్ ఏంటో గాని రుచిత బాల‌య్య‌తో న‌టించేందుకు ఓకే చెప్ప‌లేద‌ట‌.


బాల‌య్య - బోయ‌పాటి సినిమా అంటే ఖ‌చ్చితంగా సెంటిమెంట్ ప్ర‌కారం ఇద్ద‌రు హీరోయిన్లు ఉండాలి. బోయ‌పాటి ఎంత ట్రై చేస్తున్నా సరైన భామ చిక్కడం లేదు. ఇక తెలుగులో మిడిల్ ఏజ్డ్ హీరోయిన్లు ప్రతి ఒక్కరూ వరుస కమిట్ మెంట్లతో బిజీగా ఉండడం వల్ల కూడా వారు కూడా ఓకే చెప్ప‌డం లేద‌ట‌. దీంతో ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేస్తోన్న బోయ‌పాటి ఇప్పుడు త్వ‌ర‌గా హీరోయిన్ల‌ను సెట్ చేసుకుని డిసెంబ‌ర్ నుంచే ఈ సినిమాను వీలైనంత త్వ‌ర‌గా సెట్స్ మీద‌కు తీసుకు వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: