మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన బన్నీ టాలీవుడ్ లో తనకంటూ ఓన్ ఛర్మిష్మా, క్రేజ్, స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. ‘మెగా హీరోల సినిమాలకు తెగే మొదటి టికెట్ చిరంజీవి గారి అభిమానిదే’ అని గర్వంగా చెప్పుకుంటాడు. ఏదైనా నిర్మొహమాటంగా చెప్పే బన్నీ ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ ఫ్యాన్స్ కే చెప్పే తెగువ కూడా ఉంది. చిరంజీవి గారి సినిమా పాటలు గానీ, ఆయన సినిమాలు గానీ రీమేక్ చేసే ఉద్దేశ్యం ఉందా అంటే.. ‘సినిమాల్లో చిరంజీవి గారి ప్రతి స్టెప్, సినిమా, పాట ఓ క్లాసిక్స్. వాటిని మ్యాచ్ చేసే సత్తా నాకు లేదు’ అంటూ ఓపెన్ గా ఒప్పుకుంటాడు కూడా.

 


తాను చేసే ప్రతి సినిమాలో కూడా తన మార్క్ స్టైల్ చూపించి ఆ పాత్రలోకి ఒదిగిపోవడం బన్నీ స్టైల్. నా పేరు సూర్య.. సినిమాకు నిజమైన సోల్జర్ లా బాడీ బిల్డప్, హెయిర్ స్టైల్ ను మార్చేయడమే ఇందుకు ఉదాహరణ. ఇప్పటివరకూ ఓ సినిమాలో కనిపించిన మేకోవర్ మరో సినిమాలో కనిపించని కన్విక్షన్ బన్నీది. పాటల్లో వినూత్నమైన స్టెప్స్ వేయడం, డ్రెస్సింగ్ ఓన్ గా సెలక్ట్ చేసుకోవడం బన్నీ స్టైల్. ఈ స్టైలే బన్నీకి మళయాళంలో కూడా ఫ్యాన్స్ ను సంపాదించి పెట్టింది. మల్లు అర్జున్ గా మరే తెలుగు హీరోకు లేనంత మంది అభిమానులు బన్నీకి అక్కడ ఉన్నారు.

 


రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ కు కూడా బన్నీ ఇచ్చే ఇంపార్టెన్స్ సోషల్ మీడియాలో ఆయన్ను ఫాలో అయ్యేవారికి తెలుస్తుంది. ఖరీదైన కొత్త వస్తువు ఏది కొన్నా అభిమానులు, ప్రేక్షకులతో పంచుకుంటాడు. బన్నీ నటించిన అల.. వైకుంఠపురం వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది. తర్వాత సుకుమార్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: