ప్రభాస్ కి యాక్షన్ హీరోగా చేసే ఫిజిక్, భారీగా ఖర్చు పెట్టే నిర్మాతలు, అందుకు తగ్గ సినిమాలు తీసే దర్శకులూ, కథలు రాసే నిర్మాతలూ ఉన్నారు. చత్రపతి, బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్, సాహో సినిమాలు ఇందుకు ఉదాహరణ. అయితే.. హీరో అంటే ఒక్క యాక్షన్ సినిమాలే కాకుండా అన్ని జోనర్ల సినిమాలు చేయాలి. ప్రస్తుతం నేషనల్ స్టార్ డమ్ అనుభవిస్తున్న ప్రభాస్ ‘జాన్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై కొన్ని ఆసక్తికరమైన గాసిప్ప్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.

 


బాహుబలి, సాహో.. ఈ రెండు సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు అధికం. మళ్లీ యాక్షన్ ను నమ్ముకుంటే దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి. ఇది గ్రహించే రాధాకృష్ణ దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు లేకుండా లేదా బాగా తగ్గించేసి కంప్లీట్ లవ్ జోనర్ లోనే సినిమా ఉండేలా ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని టాక్. ప్రభాస్ సినిమాలు బాలీవుడ్ లో కూడా విడుదల అవుతున్నాయి.  అక్కడ లవ్ ట్రాక్ సినిమాలకు ఆదరణ కూడా ఎక్కువే. కాబట్టి యాక్షన్ నుంచి కాస్త ఛేంజ్ అయ్యేలా లవ్ జోనర్ సినిమా ద్వారా పరిచయమవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.

 


‘జాన్’ 80 దశకం లవ్ ట్రాక్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సాహో దెబ్బ కొట్టడంతో ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడట ప్రభాస్. ఇప్పటికే డార్లింగ్ లో లవర్ బాయ్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు ప్రభాస్. జాన్ లో రొమాంటిక్ ఫ్లేవర్ బాగుంటే ఫ్రెష్ ఫీల్ తో ప్రేక్షకులకు కనువిందు చేసే అవకాశం ఉంది. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: