ఈ మద్య సిని సెలబ్రెటీలకు కారు ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి.  అతి వేగం..మద్యం సేవించి వాహనాలు నడపడం..అనుకోని ప్రమాదాలు వెరసి కొన్ని సార్లు బతికి బయటపడ్డా..కొంత మంది మాత్రం దారుణంగా చనిపోతున్నారు.  ఆ మద్య నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. అంతకు ముందు రవితేజ సోదరుడు భరత్ సైతం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అయితే వీరిద్దరి మరణానికి కారణం సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం..అతివేగం అని తెలిసిందే.  తెలుగు రాష్ట్రాల్లో కొంత కాలంగా వరుసగా రోడ్డు ప్రమాదాల సంఖ్య తీవ్రం అవుతూనే ఉంది.

తాజాగా ఈ తెల్లవారుజాము హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాగా, రాజశేఖర్ దంపతులకు రోడ్డు ప్రమాదం జరిగిందని కొద్దిక్షణాల్లోనే వార్తలు వైరల్ అయ్యాయి.  తాజాగా ఈ విషయంపై  తనకు ఎటువంటి గాయాలు కాలేదని, తాను క్షేమంగా ఉన్నానని రాజశేఖర్ వెల్లడించినట్టు సినీ పీఆర్వో బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇదే సమయంలో రాజశేఖర్ మాట్లాడారంటూ, ఓ ప్రకటనను ఆయన విడుదల చేశారు. మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వస్తుండగా, ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద గోల్కొండ, అప్పా జంక్షన్ వద్ద నా కారు స్కిట్ అయి ప్రమాదం జరిగింది.  ఆ సమయంలో కారులో నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను. 

ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనేనని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లో నుంచి బయటకు లాగి నన్ను కాపాడారు.  వారి వద్ద ఉన్న ఫోన్ తీసుకొని పోలీసులకు, నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాను.  వారి కారులోనే నేను నా ఇంటికి వెళ్లాను. జీవిత, నా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలూ కాలేదు" అని తెలిపారు. అయితే తాజాగా వస్తున్న వార్తలో మాత్రం కారు అతి వేగం వల్లనే జరిగిందని..వాహనంలో మద్యం బాటిల్ ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా మొత్తం విషయం పోలీసుల దర్యాప్తులో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: