సినిమాల్లో ముద్దు సన్నివేశాలు భలే ఉంటాయి. కొందరు దర్శకులు ముద్దును అతి సుకుమారంగా చూపిస్తే.. ఇంకొందరు.. పచ్చిగా చూపించేస్తారు. అందుకే ఇటీవల సినిమాల్లో ముద్దు సన్నివేశాలు బాగా ఘాటు పెరిగాయి. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఈ జోరు ఇంకాస్త ఎక్కువైంది.


తాజాగా ఓ కుర్ర హీరో తన తాజా సినిమాలో హీరోయిన్ ను నిచ్చెన ఎక్కి మరీ ముద్దు పెట్టుకుంటున్నాడు. ఈ తాజా స్టిల్ నిఖిల్ హీరోగా వస్తున్న అర్జున్ సురవరం అనే సినిమాలోది. ఈ సినిమా పేరు ఎక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారా.. అవును మరి సినిమా బాగా లేటైతే అలాగే అనిపిస్తుంది మరి.


యంగ్ హీరో నిఖిల్ క‌థానాయ‌కుడిగా నిర్మాత ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్పణ‌లో వస్తున్న మూవీ ఇది. మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మాత‌గా ఈ మూవీ రూపుదిద్దుకుంది. దర్శకుడు టి. సంతోష్. ఈ సినిమాలో నిఖిల్ జంట‌గా లావ‌ణ్య త్రిపాఠి న‌టించింది.


పోసాని కృష్ణముర‌ళి, సత్య‌, త‌రుణ్ అరోరా ప్రధాన పాత్రల్లో న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రఫీ అందించారు. అనేక కారణాల వల్ల లేటు అవుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్దమవుతోంది.


ప‌వ‌ర్ ఫుల్ కంటెంట్‌తో తయారైన ఈ సినిమా ను ఈ నెల 29న విడుదల చేయబోతున్నారు. మంచి ప్రామిసింగ్ ప్రాజెక్టుగా ప్రారంభమై, అనేక కారణాలో కొన్నాళ్లు షూటింగ్ అగిపోయింది.


తమిళంలో మంచి హిట్ అయిన కణితన్ సినిమా ఆధారంగా తయారైన సినిమా ఇది. ఇప్పుడు క్రమంగా అన్ని సమస్యలు అన్నీ తీరి.. విడుదలకు రెడీ అయ్యింది. మరి ప్రేక్షకాదరణ ఎలా ఉంటుందో మరి. నిఖిల్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అన్న టాక్ ఈ సినిమా నిలబెడుతుందో లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: