తెలుగు సినీ పరిశ్రమలో ఏ దర్శకుడికైనా మెగా హీరోల సినిమాలకు దర్శకత్వం వహించటం ఓ అచీవ్ మెంట్ లా భావిస్తారు. అందులోనూ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ లాంటి ఇద్దరు స్టార్ స్టేటస్ ఉన్న హీరోల సినిమాలను దర్శకత్వం చేసే అవకాశం రావటం నిజంగా అదృష్టమే. అలాంటి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్. నానితో ఎమ్ సీఏ సినిమాను తెరకెక్కించాడు వేణు. ‘మలి అవకాశంగా మెగా హీరో సినిమా పట్టేశాడే..’ అనుకునే లోపే వేణుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

 


వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీతో ఐకాన్ అనే మూవీ చేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు కూడా ప్రకటించేశాడు. నిజానికి త్రివిక్రమ్ తో చేస్తున్న అల.. వైకుంఠపురం సినిమా తర్వాత మొదలవ్వాల్సిన సినిమా ఇదేనని కూడా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా సుకుమార్ సినిమా ప్రారంభించేశాడు బన్నీ. ఇప్పుడు ఐకాన్ సినిమా ఉంటుందో లేదో తెలీని పరిస్థితి. ఇదిలా ఉండగానే వేణు శ్రీరామ్ కు మరో భారీ అవకాశం తలుపు తట్టింది. పవన్ కల్యాణ్ తో దిల్ రాజు నిర్మిస్తాడని చెప్పుకుంటున్న పింక్ రీమేక్ ను వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తాడని ప్రచారం జరిగింది.

 

 

దీంతో వేణు అదృష్టవంతుడని అనుకున్నారు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ సినిమా చేస్తాడా లేదా అనేది ఆయనకే తెలీని పరిస్థితి. పవన్ కన్ఫ్యూషన్ దిల్ రాజుతో పాటు వేణుకు కూడా పరిక్షగా మారింది. దీంతో ఇద్దరు మెగా హీరోలు ఒకేసారి ఒకే డైరక్టర్ కెరీర్ ను కన్ఫ్యూషన్ లో నెట్టేశారు. అసలే వేణుకు రెండో సినిమా.. అదీ మెగా అవకాశం. మరి ఈ అవకాశాలు వేణు వరకూ వస్తాయో ఎండమావిలా మిగలిపోతాయో మెగా హీరోల నిర్ణయాన్ని బట్టే ఉంటుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: