మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి అక్టోబర్ రెండో తారీఖున విడుదలయి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దసరా సెలవుల నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రికార్డు కలెక్షన్లు మరియు నాన్ బాహుబలి రికార్డులను పగలగొట్టి కొత్త రికార్డులను టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించింది. దేశ స్వాతంత్రం కోసం తెలుగు జాతికి చెందిన మొట్టమొదటి పోరాట యోధుడిగా చరిత్రలో నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించడమే కాకుండా అనేకమంది రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల ప్రశంసలను అందుకుంది.


ఇటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమాపై వస్తున్న రూమర్లకు అమెజాన్ సంస్థ చెక్ పెట్టింది. విషయంలోకి వెళితే మొన్నటిదాకా సినిమా హాల్లో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమాని...కొంతమంది సినిమా ప్రేక్షకులు స్ట్రీమింగ్ ద్వారా చూడాలని అనుకుంటున్నారు.దీనితో ఈ చిత్రం డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వారిని ఎప్పుడు అధికారికంగా పెడుతున్నారని అడగసాగారు.ఇంతలో కొంతమంది ఈ చిత్రం ఈ నవంబర్ 15 నుంచి స్ట్రీమ్ అవ్వనుంది అని అప్పటి నుంచి చూడొచ్చని ప్రచారం చేసారు.


కానీ అసలు విషయంలోకి వెళ్లినట్టయితే అసలు తాము ఇంకా ఎలాంటి ప్రకటన చెయ్యలేదని సైరా స్ట్రీమింగ్ కు సంబంధించి అన్ని వివరాలు త్వరలో చెప్తామని అమెజాన్ వారు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ ద్వారా ఎప్పుడు చూస్తామో అని కొంతమంది సైరా సినిమా అని అతిగా ప్రేమించిన ప్రేక్షకులు అమెజాన్ సంస్థ ఎప్పుడు విడుదల చేస్తోందని ఎదురుచూస్తున్నారు. మరోపక్క సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి కొరటాలతో చేయబోయే సినిమా కోసం మంచి జోష్ మీద ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: