ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 3 ముగిసింది.  బిగ్ బాస్ 3 సీజన్ చప్పగా సాగిందని, పెద్దగా మెరుపులు, విరుపులు లేవని చెప్పిన వాళ్ళ నోళ్లను నాగ్ మూయించాడు.  సీజన్ స్టార్టింగ్ లో రచ్చ చేసిన రేటింగ్.. ఆ తరువాత క్రమంగా తగ్గిపోయింది.  చప్పగా సాగిందని కామెంట్స్ వచ్చాయి.  ఎదో నడుస్తుంది కదా కడవని అన్నట్టుగా షో సాగింది.  ఫైనల్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ షోపై ఆసక్తి పెరిగింది.  


షోలో ఫైనల్స్ లో ఐదుగురు సభ్యులు ఉండటంతో అసలు కథ మొదలైంది.  ఐదుగురిలో విజేత ఎవరు అనే విషయంపై సాగిన ప్రయాణం మొత్తం నాలుగున్నర గంటలు.  నాలుగున్నర గంటల సమయంలో టిఆర్పి రేటింగ్ అదిరిపోయింది.  బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో 14.13 రేటింగ్ వస్తే సెకండ్ సీజన్ నాని హోస్ట్ గా చేసిన సమయంలో 15.05 రేటింగ్ వచ్చింది.  ఇక మూడో సీజన్ నాగ్ హోస్ట్ చేసిన సమయంలో ఏకంగా 18 కి పైగా రావడం విశేషం.  


చివరి గంట సమయంలో రేటింగ్ పీక్స్ కు వెళ్ళింది.  22.4 రేటింగ్ వచ్చింది ఆ సమయంలో.  ఆ స్థాయిలో రేటింగ్ రావడం అంటే మాములు విషయం కాదు.  మెగాస్టార్ చిరంజీవి వచ్చిన తరువాత ఈ రేటింగ్ వచ్చింది.  మొదటి రెండు సీజన్స్ కంటే మూడో సీజన్ సూపర్ హిట్ కావడంతో అందరు షాక్ అవుతున్నారు.  ఇక ఇండియన్ బిగ్ బాస్ చరిత్రలో ఈ స్థాయిలో రేటింగ్ రేటింగ్ రావడం విశేషం.  ఇండియాలో ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ రేటింగ్ టాప్ గా నిలిచింది.  


బిగ్ బాస్ 3 సీజన్ లో వచ్చిన రేటింగ్ చూసి నాగ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.  ఈ స్థాయిలో హిట్ అవుతుందని ఊచించలేదని, అద్భుతంగా ఉందని చెప్పి పండుగ చేసుకోవడం విశేషం.  నాగ్ తనకు అప్పగించిన పాత్రను అద్భుతంగా నిర్వహించారు.  మరి నాలుగో సీజన్ లో ఎవర్ని హోస్ట్ గా తీసుకుంటారో చూడాలి.  హిందీ బిగ్ బాస్ ను సల్మాన్ ఖాన్ గత 13 ఏళ్లుగా హోస్ట్ చేస్తున్నారు.  ఇటు తమిళంలో కూడా మూడేళ్ళుగా కమల్ హోస్ట్ చేస్తున్నాడు.  తెలుగులో మాత్రం మూడు సీజన్స్ లో ముగ్గురు హోస్ట్ చేయడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: