‘ఓ బేబి’
మూవీ తరువాత సమంతకు ఎన్నో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే
సమంత ఏ ప్రాజెక్ట్ కు ఓకె చేయకపోవడంతో ఆమెకు ఏమైంది అంటూ చాలామంది ఆశ్చర్యపోతు దీని వెనుక గల కారణాలను విశ్లేషిస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు
సమంత కొత్త సినిమాలకు సైన్ చేయకుండా అడ్డు తగులుతున్న ఆ అదృశ్య శక్తి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అని తెలుస్తోంది.
అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మిస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ ను దేశంలోని అనేక ప్రాంతాలలో చిత్రీకరిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో
సమంత హైదరాబాద్ మూలాలు ఉన్న ఒక టెర్రరిస్ట్ పాత్రలో నటిస్తోంది అని తెలుస్తోంది.
దీనికోసం ఆమె తన
హైదరాబాద్ హిందీ స్లాంగ్ ను మెరుగు పరుచుకోవడానికి ఒక ప్రత్యేకమైన ట్యూటర్ ను పెట్టుకోవడమే కాకుండా కొన్ని మార్షల్ ఆర్ట్స్ విద్యలకు సంబంధించి ప్రత్యేకమైన ట్రైనింగ్ ను కూడ
సమంత తీసుకుంది. తాను నటించే సినిమాలలో ఒక ప్రత్యేకత ఉన్న పాత్రను మాత్రమే అంగీకరిస్తాను అని
సమంత తనను కలుస్తున్న యంగ్ డైరెక్టర్స్ కు చెపుతున్న పరిస్థితులలో ప్రస్తుతం సమంతకు కథలు చెప్పడం చాల కష్టంగా మారింది అని చాలామంది దర్శకులు కామెంట్స్ చేస్తున్నారు.
ఒక
హీరోయిన్ అంటే ఒక పరిధిలో అలాగే ఉండాలి అన్న పాత్రలు తనకు వద్దు అనీ ప్రస్తుతం తాను తన కెరియర్ ను కేవలం డబ్బు కోసం కాకుండా తన వృత్తిని ఎంజాయ్ చేయడం కోసం సినిమాలలో నటిస్తున్నాను అంటూ
సమంత లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. దీనితో సమంతను ఒక కథ చెప్పి ఒప్పించే
కన్నా ఒక హీరోను ఒప్పించడం సులువు అంటూ చాలామంది దర్శకులు సమంతకు కథ చెప్పడానికి భయపడి పోతున్నట్లు టాక్..