రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. సినిమాల్లో నటించేవారి కుటుంబాలలో ఎక్కువగా ఇటువంటి అభద్రతా భావాలు ఉంటాయి. ఎందుకంటే ఫలానా హీరో తెరపై హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తుంటే అతని భార్యకు కానీ, ఇంట్లో వారికి కానీ చూడటానికి చాల ఇబ్బందిగా  ఉంటుంది. ఇక పెళ్లైన హీరో, హీరోయిన్ల పరిస్థితి గురించి మనం ఊహించలేం. పెళ్లయ్యాక హీరోలు సినిమాలు చేస్తుంటారు కానీ అలా చేసే హీరోయిన్లు మాత్రం తక్కువనే చెప్పాలి. ఒకవేళ పెళ్లి తర్వాత సినిమాలు చేసినా గతంలోలా రొమాన్స్ సీన్లకు చాలా దూరంగా ఉంటామని అంటారు.


తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ తన భర్త గురించి ఇదే విషయం పై మాట్లాడారు. ఆయుష్మాన్ అతను చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆయన నటించిన ‘బాలా’ సినిమా అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ నేపథ్యంలో తహీరా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

తన భర్త సినీ కెరీర్, సక్సెస్ గురించి మాట్లాడుతూ.. ‘నా భర్త యాక్టర్‌గా సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ తెరపై మరో హీరోయిన్‌తో ఆయన రొమాన్స్ చేసినా, సెక్స్ చేసినా అభద్రతా భావానికి గురయ్యేదాన్ని. తట్టుకోలేకపోయేదాన్ని. కానీ అది కూడా నటనలోనే భాగం కదా అని ఊరుకున్నా’.


‘కొన్నాళ్ల తర్వాత నాలో ఎంత మార్పు వచ్చిందంటే.. మా వారు నటించిన ‘అంధాధున్’ సినిమాలో రాధికా ఆప్టేతో రొమాన్స్ చేసే సన్నివేశం ఒకటి ఉంది. ఆ సీన్‌లో వారిద్దరి మధ్య ఏదో మిస్సయింది అని నేనే సలహాలు ఇచ్చే స్టేజ్‌కి వచ్చాను. నాకు నా భర్త 18 ఏళ్లుగా తెలుసు. నేను ఆయుష్మాన్ భార్యను అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ఇప్పుడు సమాజం నన్ను కూడా గౌరవించడం మొదలుపెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: