నిజజీవితంలో మామా అల్లుళ్లు అయిన
వెంకటేష్,
నాగ చైతన్య రీల్ లైఫ్ లో కూడా అదే క్యారక్టర్లలో నటిస్తున్న
సినిమా వెంకీ మామ. ఈ మధ్య కాలంలో ఈ
సినిమా రిలీజ్ డేట్ గురించి వచ్చిన వార్తలు మరే సినిమాకు రాలేదు. మొదట ఈ
సినిమా దసరా పండుగ సందర్భంగా విడుదలవుతుందని వార్తలు వినిపించాయి. కానీ
దసరా రేసు నుండి
వెంకీ మామ తప్పుకోవటంతో ఆ తరువాత ఈ సినిమాకు రకరకాల రిలీజ్ డేట్లు వినిపించాయి.
ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం మేరకు
వెంకటేష్ పుట్టినరోజు కానుకగా
డిసెంబర్ 13వ తేదీన ఈ
సినిమా విడుదల కాబోతుందని తెలుస్తోంది. కానీ
డిసెంబర్ 13వ తేదీన
వెంకీ మామ రిలీజ్ అయితే వారం రోజుల్లో ఈ
సినిమా బ్రేక్ ఇవెన్ కావల్సి ఉంటుంది. ఎందుకంటే
డిసెంబర్ 20వ తేదీన
బాలకృష్ణ రూలర్, సాయిధరమ్ తేజ్
ప్రతిరోజు పండగే సినిమాలు విడుదలవుతాయి. వెంకీమామ సినిమాకు 50 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ అయిందని తెలుస్తోంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో కనీసం రెండు వారాలు ఈ సినిమాకు పోటీ లేకుండా ఉంటే మంచిది. కానీ సరైన రిలీజ్ డేట్ దొరకకపోవటంతో ఈ
సినిమా నిర్మాత సురేష్ బాబు
డిసెంబర్ 13వ తేదీనే విడుదల చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇప్పటికే ప్రొడక్షన్ యూనిట్ కు ఈ మేరకు సమాచారం అందిందని తెలుస్తోంది. మరికొన్నిరోజుల్లో అధికారికంగా రిలీజ్ డేట్ చిత్ర యూనిట్ ప్రకటిస్తుందని తెలుస్తోంది.
వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాలో రాశిఖన్నా, పాయల్
రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు అక్కినేని
సమంత,
రానా వెంకీమామ
సినిమా విషయంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
సినిమా మీద ప్రత్యేక శ్రద్ధ వీరిద్దరూ పెడుతూ సినిమాకు దిద్దుబాట్లు చేస్తున్నారని సమాచారం