తెలుగు సినీ పరిశ్రమలో మొదటి తరం వైభవంలో ఎందరో నటులు మహా నటులయ్యారు. ప్రేక్షకులను ఆకట్టుకుని తెర వేల్పులుగా రాణించారు. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు, ఏఎన్నార్ సాంఘీక పాత్రల్లో, ఎస్వీఆర్ కేరెక్టర్ పాత్రల్లో లబ్ద ప్రతిష్టులుగా నిలిచిపోయారు. అలాంటి వారిలో మరికొంత మంది కూడా తమ ఉనికి చాటుకుని తెలుగు సినామాకు వెలుగులు నింపారు. వారిలో కొంగర జగ్గయ్య కూడా ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్లో చెరగని మద్ర వేశారు.

 


ఓ దశలో అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లో జగ్గయ్యకు కేరెక్టర్ ఆర్టిస్టు పాత్ర తప్పనిసరిగా ఉండేది. నాటక రంగం నుంచి వచ్చినా స్వయంకృషితో సినిమాల్లో రాణించి దాదాపు 500 సినిమాల్లో నటించి మెప్పించారు. సినిమాల్లో ఆ తరం తర్వాత కొందరు వారసత్వం కొనసాగించారు.. కొనసాగిస్తూ సినీ పరిశ్రమను ఏలుతున్నారు. కానీ కొంగర జగ్గయ్య లాంటి మరికొందరు సీనియర్లకు వారసులు లేరా అని ప్రేక్షకులు కూడా అనుకుంటూ ఉంటారు. కానీ.. జగ్గయ్య గారి వారసత్వం బుల్లి తెరపై ఉందనేది చాలా మందికి తెలిని విషయం. ఆయన వారసుడిగా నటనా రంగంలో ఆయన మనవడు సాత్విక్ కృష్ణ జగ్గయ్య వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. సాత్విక్ స్వయానా జగ్గయ్య అన్నకు మనవడు. జగ్గయ్య సొంత కొడుకులు, కూతుళ్లు.. తర్వాత తరం ఎవరూ సినీ రంగంలోకి రాకపోయినా సాత్విక్ ఆ లోటు తీరుస్తున్నాడు.

 


స్వాతి చినుకులు, మధుమాసం వంటి సీరియల్స్ లో విలన్ క్యారెక్టర్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఇదే విధంగా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తే కొంగర జగ్గయ్య వారసత్వం నిలబెట్టినట్టే. కొంగర జగ్గయ్య తన నటనతో పాత్రలో లీనమైపోయేవారు. కంచు కంఠం, కళా వాచస్పతి.. అనే బిరుదులు ఆయన సొంతం. పాత సినిమాలు చూస్తే ఆయన నటనా కౌశలం అద్భుతం అనిపించక మానదు.


మరింత సమాచారం తెలుసుకోండి: