తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ తో సినిమా అవకాశం వస్తే ఎవరు మాత్రం గంతులేయకుండా ఉంటారు. అలాంటి అరుదైన అవకాశమే తమిళ స్టార్ డైరక్టర్ మురుగదాస్ కు దక్కింది. 13 ఏళ్ల క్రిత్రం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని స్టాలిన్ సినిమాతో డైరక్ట్ చేసిన మురుగదాస్ ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను డైరక్ట్ చేశాడు. దర్బార్ సినిమాతో రజినీకాంత్ ను డైరక్ట్ చేసి తన కల నెరవేర్చుకున్నాడు. ఇటివలే ఈ సినిమా షూటింగ్ పూర్తైన సందర్భంగా తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.

 

 

రజినీకాంత్ ను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చూపిస్తున్న మురుగదాస్ తనదైన స్టైల్లో సినిమాను తెరకెక్కించాడని కోలీవుడ్ టాక్. ఇప్పటికే విడుదలైన రజినీ స్టిల్స్, మోషన్ టీజర్ రజినీ అభిమానులను ఆకట్టుకున్నాయి. దర్బార్ కు సంబంధించి రజినీకాంత్ తన పాత్రకు డబ్బింగ్ వెర్షన్ ను కూడా పూర్తి చేశాడు. ఈ సందర్భంగా మురుగదాస్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ లో రజినీతో కలిసి కూర్చున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ‘దర్బార్ కు సంబంధించి రజినికాంత్ డబ్బింగ్ పూర్తైంది. నా లైఫ్ లో బెస్ట్ డబ్బింగ్ పార్ట్ ఇది’ అని రాసుకున్నాడు.  వచ్చే సంక్రాంతికి దేశవ్యాప్తంగా దర్బార్ ను రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.

 

 

దీంతో రజినీ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. రజినీకాంత్ అంటే స్టైల్ కు పెట్టింది పేరు. అలాంటిది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజినీ మ్యానరిజమ్స్ తో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. ఈ సినిమాకు సంతోశ్ శివన్, శ్రీకర్ ప్రసాద్, అనిరుధ్ తదితర భారీ సాంకేతిక వర్గం మెరుగులద్దారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: