ఒకనాటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ‘జార్జి రెడ్డి’ జీవితం ఆధారంగా తీయబడ్డ మూవీలో జార్జి రెడ్డి పాత్రను యంగ్ హీరో సందీప్ యాదవ్ నటించాడు. రామ్ గోపాల్ వర్మ తీసిన ‘వంగవీటి’ మూవీలో కీలక పాత్రను చేసిన సందీప్ యాదవ్ చాల గ్యాప్ తీసుకుని నటించిన ఈ ‘జార్జి రెడ్డి’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

మొదటి నుండి అభ్యుదయ భావాలు ఎక్కువగా ఉండే పవన్ తన కెరియర్ తొలి రోజులలో జార్జి రెడ్డి కథను తెలుసుకుని ఆమూవీలో నటించాలని ప్రయత్నించిన విషయాలు ఇప్పుడు బయట పెట్టాడు. అయితే అప్పటికే పవన్ కమర్షియల్ హీరోగా మారిపోవడంతో ఆ సినిమాను పవన్ తో చేసే ఆలోచనలను విరమించుకున్న విషయాన్ని సందీప్ యాదవ్ వివరించాడు. 

1970 కాలంలో జరిగిన వాస్తవిక యదార్ధ సంఘటనలను ఆధారంగా చేసుకుని తీసిన జార్జి రెడ్డి పై ఇప్పుడు పెను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ సినిమాను రిలీజ్ చేస్తే వ్యతిరేకిస్తాము అంటూ అఖిల్ భారత విద్యార్థి సంఘం నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టిన నేపధ్యంలో ఈమూవీకి ఖర్చు ఏమీ లేకుండానే విపరీతమైన పబ్లిసిటీ వస్తోంది. 

ఇప్పటికే అనేక ప్రముఖ ఛానల్స్ ఈ వారం విడుదల కాబోతున్న ఈ మూవీ పై చర్చలు నిర్వహిస్తున్న పరిస్థుతులలో ఈ మూవీ మ్యానియా బాగా పెరిగి పోయింది.  దీనితో ఈ మూవీలో ఏదో ఉండబోతోంది అన్న అంచనాలు పెరిగి పోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయితే మరో ‘అర్జున్ రెడ్డి’ గా మారినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. 1970 ప్రాంతంలోనే కంప్యూటర్స్ అన్ని రంగాలను ఎలా శాసిస్తాయో జార్జి రెడ్డ్డి ఊహించాడు అని తెలిస్తే అతడు ఎలాంటి ప్రతిభాశాలో అర్ధం అవుతుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: