సంక్రాంతి రేసుకు రాబోతున్న సినిమాల రిలీజ్ డేట్స్ కు సంబంధించి ఒక క్లారిటీ వస్తోంది. ఈ రేసుకు రాబోతున్న బన్నీ మహేష్ ల మూవీల రిలీజ్ డేట్ కు ముడిపడ్డ ఒక సెంటిమెంట్ రజినీకాంత్ కు అదృష్టంగా మారి కలక్షన్స్ కురిపిస్తుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

తెలుస్తున్న సమాచరం మేరకు రజినీకాంత్ ‘దర్బార్’ జనవరి 9న విడుదల అవ్వడానికి లైన్ క్లియర్ చేసుకుంది. దీనితో టాప్ హీరోల సినిమాలకు సెంటిమెంట్ గా బాగా కలిసి వచ్చే శుక్రువారం జనవరి 10 ఖాళీగా ఉన్నా ఆ డేట్ అంటే మహేష్ త్రివిక్రమ్ లు షాక్ అవుతున్నట్లు తెలుస్తోంది. 

జనవరి 10 తారీఖు గుర్తుకు రాగానే మహేష్ కు ‘1 నేనొక్కడినే’ త్రివిక్రమ్ కు ‘అజ్ఞాతవాసి’ సినిమాలు గుర్తుకు వచ్చి జనవరి 10న విడుదలైన ఆ రెండు సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారడంతో వీరిద్దరూ ఆ డేట్ వినగానే ఈ ఇద్దరు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11న ‘అల వైకుంఠ పురములో’ జనవరి 12న విడుదల చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 

త్రివిక్రమ్ మహేష్ లకు ఏర్పడ్డ ఈ సెంటిమెంట్ భయాలతో రజినీకాంత్ డబ్బింగ్ సినిమా ‘దర్బార్’ రెండు రోజులు ఎటువంటి పోటీ లేని అవకాశం దొరికింది. ‘దర్బార్’ కు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మహేష్ త్రివిక్రమ్ ల సెంటిమెంట్ రజినీకాంత్ కు కాసులు కురిపిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలలో రజినీకాంత్ సినిమాలకు సరైన ఓపెనింగ్స్ కూడ రావడం లేదు. దీనికితోడు ఈమధ్య యూత్ లో కూడ రజినీకాంత్ పట్ల మ్యానియా బాగా తగ్గింది. ఇప్పుడు మహేష్ త్రివిక్రమ్ లు ఇచ్చిన అవకాశాన్ని రజినీకాంత్ ఎంతవరకు సద్వినియోగ  పరుచుకుని సంక్రాంతి విజేతగా నిలబదగాలడేమో  చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: