ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర, టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ విజయచందర్ నిన్న హైదరాబాద్ లో విలేకర్లతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం తెలుగు చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడమే అని విజయచందర్ అన్నారు. సినిమాల చిత్రీకరణకు నేరుగా అనుమతులు ఇచ్చి ప్రోత్సహించనున్నామని విజయచందర్ తెలిపారు. థియేటర్లలో వారంరోజుల పాటు పరిమిత వ్యయంతో తెరకెక్కే చిత్రాలను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయనున్నట్టు విజయచందర్ తెలిపారు. 
 
చలన చిత్ర, టెలివిజన్, నాటక రంగ సంస్థ ఛైర్మన్ గా నియమిస్తానని వై యస్ రాజశేఖర్ రెడ్డి గతంలో మాట ఇచ్చాడని విజయచందర్ తెలిపారు. ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నానని సినిమా రంగానికి చెందిన అందరినీ కలుసుకొని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు విజయచందర్ తెలిపారు. సినిమాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి చిన్నప్పటినుండి ఇష్టమని విజయచందర్ తెలిపారు. 
 
సీఎం జగన్ నందమూరి బాలకృష్ణ అభిమాని అని విజయ్ చందర్ తెలిపారు. నందమూరి బాలకృష్ణ సినిమాలు విడుదలయ్యే సమయంలో 
సీఎం జగన్ ఊళ్లో సంబరాలు జరుపుకునేవారని విజయ్ చందర్ అన్నారు. సీఎం జగన్, హీరో సుమంత్ కలిసి చదువుకున్నారని విజయచందర్ చెప్పారు. సీఎం జగన్ కు సినిమా పరిశ్రమతో అనుబంధం ఉందని చిత్ర పరిశ్రమ అభివృద్ధి కొరకు సహాయం చేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 
 
పరిశ్రమ కోసం గతంలో స్థలాలు కేటాయించడానికి, సినిమా షూటింగ్ కోసం ఎలాంటి వసతుల్ని సమకూర్చడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని విజయచందర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, నాటకరంగ, టెలివిజన్ డైరెక్టర్ గా దర్శకుడు సుజీత్ ని ఎంపిక చేసినట్లు విజయచందర్ తెలిపారు. గతంలో సీఎం జగన్, బాలకృష్ణ అభిమాని అంటూ కొన్ని వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు ఆ వార్తలను కొంతమంది నమ్మగా మరికొందరు మాత్రం పుకార్లు అని ఖండించారు. ఛైర్మన్ విజయచందర్ ఈ విషయం గురించి స్పష్టత ఇవ్వటంతో ఈ వార్తలు నిజమేనని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: