దూరపు కొండలు నునుపు అనాలో, లేక మన తెలుగోళ్లకు తెలుగు ట్యాలెంట్ కనిపించదు అని సరిపెట్టుకోవాలో తెలియటంలేదు!  కానీ తెలుగు భామలకు అవకాశాలు అంతంత మాత్రమే అని చెప్పాలి. ముంబై క్యాట్ వాక్ భామలకే ముచ్చెమటలు పట్టించే అందగత్తెలు మనకు ఉన్నారు కానీ ఎందుకనో తెలుగు సినీ పరిశ్రమ వారి వైపు చిన్న చూపు చూస్తూనే వస్తూ ఉంది. తెలుగు అందాలకు ఏం తక్కువని మన దర్శక నిర్మాతలు అవకాశాలివ్వరో అర్థం కాని పరిస్థితి.

 

ఇటీవల సైలెంటుగా దూసుకొచ్చిన తెలుగు అందం పూజిత పొన్నాడ గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. అందానికి అందం చక్కని తెలివితేటలు అభినయం అన్నిటి కలగలుపుతో ఈ భామ అభిమానుల్ని సంపాదించుకుంది. `రంగస్థలం` చిత్రంలో చక్కని అభినయంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం కెరియర్ పరంగా ముందుకు దూసుకుపోతోంది.

Image

 

హవీష్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ `7`లో ఆరుగురు నాయికల్లో ఒక కథానాయికగా నటించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగమ్మాయి అయినా  చెన్నయ్ లో చదువు పూర్తి చేసిన పూజిత తమిళం చక్కగా మాట్లాడుతుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కెరియర్ ప్రారంభించి,ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. అలా ఓ షార్ట్ ఫిల్మ్లో చూసి సుకుమార్ `రంగస్థలం` చిత్రంలో అవకాశం ఇచ్చారు. అందులో ఆది భార్య పాత్రలో నటించింది.

 

లిప్ లాక్ లు, ఎక్స్ పోజింగుకి వెరువని ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మరో కొత్త ఫోటో షూట్ తో అదరగొట్టేసింది. బ్లాక్ ఫ్రాకులో ఈ అమ్మడి అందాల మాములుగా కాకుండా చాలా స్పైసీ అనే చెప్పాలి. అంతగా ఎక్స్ పోజ్ చేస్తున్నట్టు కనిపించినా అందులో ఏ మేరకు ఎలివేట్ చేయాలో అంత వరకూ అందాల్ని ఓపెనప్ అయ్యింది. అన్నిటినీ మించి ఆ థై స్లిట్ లుక్ తో కుర్రాళ్ల గుండెలో అగ్గి  రాజేసింది. ప్రస్తుతం తెలుగమ్మాయిలకు అవకాశాలు పెరిగే అవకాశం ఉందని పూజిత చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: