మోహన్ బాబు... తెలుగు సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆయన అలవోకగా చెప్పే డైలాగు ల కోసం ఇప్పటికీ ఎదురుచూసే అభిమానులెందరో. సిని 'మాప్రపంచం' లో డైలాగులతో కూడా సన్నివేశాలను రక్తి కట్టించవచ్చు అని ఆయనను చూసి చెప్పవచ్చు. ఆయన అలా బిక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పుకుంటూ వెళ్తుంటే కలెక్షన్లు సునామీలా వచ్చేవి. అందుకోనేమో ఆయనకు కలెక్షన్ కింగ్ అని పేరు పెట్టారు.  మన కలెక్షన్ కింగ్ సినిమాల్లోకి అడుగుపెట్టి నేటికీ సరిగ్గా 44 ఏళ్ళు అయింది. 44 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ఆయన ఎన్నో ఫ్లాప్ లను చూసాడు ప్లాప్ అయిన సినిమాలను చూసి ఏనాడు ఆత్మస్తైర్యం కోల్పోలేదు. అలాగని హిట్ అయిన సినిమాలను చూసి విర్రవీగకుండా దర్శకుని విజన్ వలెనే హిట్ అయిందంటూ దర్శకులపై ప్రశంసలు కురిపించాడు. అందుకేనేమో దాసరి నారాయణ లాంటి గొప్ప దర్శకుడితో శబాష్ అనిపించుకున్నాడు. ఆయనకు శిషుడిగా మారగలిగాడు.

Image result for mohan babu

ఒకటా.. రెండా... ఏకంగా 44 ఏళ్ల ఇండస్ట్రీ అంటే మామూలు విషయం కాదు. ఐదారేళ్లు ఇండస్ట్రీలో వుండి కేవలం ఒక్క ప్లాప్ పడితేనే హీరోలు కనుమరుగవుతున్న రోజులివి.సరిగ్గా 44 ఏళ్ల కిందే సరిగ్గా ఇదే రోజు ఆయన నటించిన 'స్వర్గం నరకం' సినిమా విడుదలైంది. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఈ చిత్రంతోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ తొలి రోజుల్లో హీరోతో పాటు విలన్ గానూ అలరించాడు మోహన్ బాబు.

 

Image result for mohan babu

 

తెలుగు ఇండస్ట్రీలో ఎందరో హీరోలు వున్నా మోహన్ బాబు ప్రత్యేకం. హీరోలు కూడా అంతంతమాత్రంగానే చెప్పే సెటైరికల్ డైలాగ్స్ ను  విలన్ పాత్రలో కూడా అలవోకగా చెప్పి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే విలన్ కు కూడా ఓ స్టైల్.. మేనరిజమ్స్ అలవాటు చేసిన నటుడు ఒక్క మోహన్ బాబు మాత్రమే. హీరో అయిన తర్వాత ఈయన విలనిజాన్ని చూసే భాగ్యం ప్రేక్షకులకు మిస్ అయిపోయింది. ఎనభైల్లోఏ సినిమా విడుదలైనా కూడా అందులో మోహన్ బాబు కనిపించాల్సిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు నుంచి చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వరకు అందరితోనూ కలిసి నటించాడు మోహన్ బాబు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: