కొన్ని రోజుల క్రితం అల్లు అరవింద్ కు 70 సంవత్సరాలు వచ్చిన నేపధ్యంలో అతడి ఆస్థులను అదేవిధంగా అతడి బాధ్యతలను తన ముగ్గురు కొడుకులకు పంచిన విషయానికి సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో సందడి చేసాయి. ఇప్పుడు అల్లు అర్జున్ అదేవిధంగా అల్లు శిరీష్ ఎవరికి వారు ఏర్పాటు చేసుకున్న రెండు విలాసవంతమైన పెద్ద ఆఫీసులు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ న్యూస్ గా మారాయి. 

ముఖ్యంగా అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని పోష్ ఏరియాలో ఏర్పాటు చేసుకున్న ఎంతోఖరీదైన ఆఫీస్ వార్తలు చాల మందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. స్లైలిష్ స్టార్ ట్యాగ్ లానే బన్నీ ఆఫీసు కూడ చాల స్టైలిష్ గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఒక పెద్ద కార్పోరేట్ ఆఫీసు తరహాలో బన్నీ ఆఫీసు ఖరీదైన పర్నిచర్ కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.  

ఈఆఫీసు ఇంటిరీయర్ డెకరేషన్ కు సంబంధించి బన్ని స్వయంగా శ్రద్ధ తీసుకోవడమే కాకుండా అందుకు అవసరమైన వాటిని విదేశాల నుంచి ఇంపోర్ట్ చేశాడట. ముఖ్యంగా ఈఆఫీసులో స్క్రిప్ట్స్  డిస్కషన్స్ కి  ఒక రూమ్ డైరెక్టర్స్ తో ఇంటరాక్షన్ కి సపరేట్ గా ఒకగది తనని వ్యక్తిగతంగా కలవడానికి వచ్చిన పెద్ద వ్యక్తుల కోసం సపరేట్ ఛాంబర్ అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రత్యేకంగా ఒక హాల్ డిజైన్ చేయించుకున్నాడట బన్నీ. అంతేకాదు బ్రాండ్ అండ్ ఎండోర్స్ మెంట్ డీల్స్ కోసం  ప్రత్యేకంగా ఒక రూమ్ ను కూడ ఏర్పాటు చేసారట. మీడియా సమావేశాలకు ప్రత్యేకంగా ఒక హాల్ బన్ని పర్సనల్ ఇంటర్వూలకు సంబంధించి సపరేట్ చాంబర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసారని తెలుస్తోంది. 

అదేవిధంగా అల్లు శిరీష్ ఇప్పటికే ఓటీటీ కోసం సపరేట్ ఆఫీస్ ని మెయింటెయిన్ చేస్తున్నాడు. ఈఆఫీసు కూడ అత్యంత విలాసవంతంగా ఉంటుందని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ సంస్థలా వెబ్ సిరీస్ లను నిర్మాణం చేసే టార్గెట్ తో అరవింద్ ఏర్పాటు చేసిన ఓటీటీ ప్రాజెక్ట్ కు అరవింద్ భారీ పెట్టుబడులు పెట్టడమే కాకుండా దాని బాధ్యతలు అన్నీ శిరీష్ కు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అరవింద్ తన పెద్ద కొడుకు అల్లు బాబికి గీతా సంస్థ నిర్మాణ బాధ్యతలు అన్నీ అప్పచెప్పి వీరి ముగ్గురునీ అంబాని బ్రదర్స్ లా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అల్లు బ్రదర్స్ కు ఒకస్థాయి వచ్చేలా కష్టపడి గౌరవం తెచ్చుకోమని దిశా నిర్దేశం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: