త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ ని ‘అల వైకుంఠపురములో’ నటించేలా ఒప్పించడానికి సుమారు 5 సార్లు ఈ కథలో మార్పులు చేసాడు అన్న వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ తన కెరియర్ లో ఇప్పటివరకు తాను అనుకున్న కధకు ఇన్ని మార్పులు చేసిన సందర్భాలు లేవు అని అంటారు. ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో త్రివిక్రమ్ పడిన రాజీలు పవన్ కళ్యాణ్ దగ్గర కూడ పడలేదు అన్న కామెంట్స్ ఉన్నాయి. 

దీనితో ‘అల వైకుంఠపురములో’ చాలచోట్ల బన్నీ ఇష్టాలు అభిరుచులు చాల స్పష్టంగా కనిపిస్తాయి అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ నిన్న ఈ మూవీకి సంబంధించి విడుదలైన ర్యాప్ సాంగ్ ను ఉదారణంగా చెపుతున్నారు. వాస్తవానికి ఇలాంటి ర్యాప్ సాంగ్ ల పట్ల త్రివిక్రమ్ కు సరైన అభిప్రాయం లేదు. 

అయితే బన్నీకి ఈ ర్యాప్ సాంగ్ పై ఉన్న మోజుతో త్రివిక్రమ్ రాజీపడక తప్పలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ర్యాప్ సాంగ్ కు సంబంధించిన డ్రెస్సింగ్ అంతా బన్నీ అభిరుచిమేరకు జరగడమే కాకుండా ఈ పాట చిత్రీకరణ విషయంలో కూడ త్రివిక్రమ్ కు బన్నీ సలహాలు ఉన్నాయి అంటున్నారు. 

నిన్న విడుదలైన ఈ పాట మేకింగ్ వీడియోను చూసినవారు మాత్రం ఈ పాట చిత్రీకరణ ఎక్కడా త్రివిక్రమ్ స్టిల్ లో లేదు అంటూ అభిప్రాయపడుతున్నారు. దీనితో ఈ మూవీలోని ‘ఓ మై డాడీ’ పాటను బన్నీ అభిరుచి మేరకు బన్నీ స్టైల్ లో త్రివిక్రమ్ రాజీపడి తీసాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ తన పాటల సాహిత్యంలో ఇంగ్లీష్ పదాలను అంగీకరించడు. అయితే ‘ఓ మై డాడీ’ విషయంలో త్రివిక్రమ్ బన్నీ కోసం ఎన్ని మెట్లు దిగి రాజీ పడ్డాడో అర్ధం అవుతుంది అంటూ త్రివిక్రమ్ పడుతున్న పాట్లు పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: