వివాదాస్పద చిత్రాలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఎప్పుడూ నిలిచే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. పైకి గంభీరంగా కనిపించే రామ్ గోపాల్ వర్మ బాలయ్యకు భయపడ్డాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులంతా కనిపిస్తున్నారు. 
 
ఇప్పటికే కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమాకు సంబంధించిన రెండు ట్రైలర్లు ఇప్పటికే విడుదలయ్యాయి. ఆంధ్రా రాజకీయాల్లో ప్రముఖులైన వారందరినీ పరిచయం చేసిన వర్మ బాలయ్యను మాత్రం ఈ చిత్రంలో చూపించలేదు. బాలకృష్ణకు వర్మ భయపడ్డాడని బాలకృష్ణ నుండి వర్మకు వార్నింగ్ వెళ్లినందువలనే వర్మ బాలయ్య పాత్రను కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలో చూపించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖులైన సీఎం జగన్, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కే ఏ పాల్ ఇతర ప్రముఖులను రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో చూపిస్తున్నాడు. వర్మ కొన్ని నెలల క్రితం తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీయార్ చిత్రంలో బాలకృష్ణ పాత్ర కొంత సమయం ఉంది. కానీ ఈ సినిమాలో మాత్రం బాలకృష్ణ పాత్ర లేదని సమాచారం. ప్రస్తుతం వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. 
 
మరోవైపు ప్రజాశాంతి పార్టీ అధినేత  కే ఏ పాల్ హైకోర్టులో కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా విడుదల నిలుపుదల చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. మరి బాలకృష్ణ నిజంగా వర్మకు వార్నింగ్ ఇచ్చాడా...? లేదా...? అనే విషయం గురించి వర్మ ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: