సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా రాబోతున్న తాజా చిత్రం వరల్‌ ఫేమస్‌ లవర్‌. ఇటీవల డియర్‌ కామ్రేడ్‌ సినిమాతో విజయం సొంతం చేసుకోలేక పోయాడు విజయ్‌, దానితో ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. క్లాస్‌, ఎమోషనల్‌ సినిమాల దర్శకుడు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ మూడు డిఫరెంట్‌ లుక్స్‌లో ప్రేక్షకుల ముందుకు కనిపించబోతున్నాడు.

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=VIJAY' target='_blank' title='vijay- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>vijay</a> devarakonda world famous lovers images

ఇక ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఈషాబెల్లాలు హీరోయిన్లుగా పాత్ర పోషిస్తున్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. తాజాగా విడుదల ఐనా  ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు మంచి స్పందన రావటంతో చిత్రయూనిట్ సంతోషంతో మునిగితేలుతున్నారు.

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=VIJAY' target='_blank' title='vijay- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>vijay</a> devarakonda world famous lovers images

తాజాగా చిత్రయూనిట్  ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించడం జరిగింది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం సందర్బంగా  ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేయాలనుకుంటున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా వేగవంతగా జరుగుతున్నాయి అని చిత్ర యూనిట్ తెలిపింది.

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=VIJAY' target='_blank' title='vijay- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>vijay</a> devarakonda world famous lovers images

 

ఈ సినిమాతో సహా మరో రెండు సినిమాల పనుల్లో బిజీగా ఉన్నాడు విజయ్‌ దేవరకొండ. తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కుతున్న హీరో సినిమా ఇప్పటికే మొదలు కూడా అయంది. ఒక షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తయిన తరువాత షూటింగ్‌ను వాయిదా వేయడం జరిగింది. ఈ లోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక  సినిమా కూడా సరే అన్నాడు విజయ్‌ దేవరకొండ.

 

ఇటీవల ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌తో సూపర్‌ ఫాంలో ఉన్న పూరి జగన్నాథ్, తన తదుపరి చిత్రాన్ని విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తున్నట్టుగా తాజాగా వెల్లడించడం జరిగింది. ఈ సినిమాకు ఫైటర్‌ అనే టైటిల్‌ను కూడా అనుకున్నట్లు తెలిపారు. విజయ్‌ యాటిట్యూడ్‌కి, పూరి హీరోయిజ్ తోడైతే బాక్సాఫీస్‌ షేక్‌ అవుతుంది అని విజయ్‌  అభిమానులు వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: