సాధారణంగా గ్లామర్ హీరోయిన్స్ రాజకీయాల గురించి మాట్లాడారు. అలాంటికి దీనికి భిన్నంగా తమిళనాడు ప్రాంతానికి చెందని తమన్నా తమిళ రాజకీయాల గురించి మాట్లాడటం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. రాబోయే తమిళనాడు ఎన్నికలలో కమలహాసన్ రజినీకాంత్ లు కలిసి పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని వారిద్దరు కలిస్తే తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు రావడం ఖాయం అంటూ తమన్నా కామెంట్ చేసింది. 

నిన్న త్రిచీ పట్టణంలో ఒక సోరూమ్ ఓపెనింగ్ కు వచ్చిన తమన్నా మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేసింది. అంతేకాదు తాను కమల్ రజినీకాంత్ ల వీరాభిమానిని అంటూ తమన్నా తమిళనాడులోని రజినీకాంత్ కమల్ హాసన్ ల అభిమానుల ప్రాపకాన్ని పొందడానికి ప్రయత్నాలు చేసింది. 

వాస్తవానికి తెలుగులో పూర్తిగా అవకాశాలు తగ్గిపోవడంతో తమన్నా కోలీవుడ్ సినిమాల వైపు చూస్తోంది. ఈమె లేటెస్ట్ గా విశాల్ తో ‘యాక్షన్’ మూవీలో నటించినా ఆ సినిమాతో తమన్నాకు పెద్దగా క్రేజ్ రాలేదు. అయితే ఈమె తమిళంలో నటించిన ‘కన్నె కలైమనె’ మూవీలోని ఆమె పాత్రకు మాత్రం మంచి పేరు వచ్చింది. 

అయినప్పటికీ ఆమె వంక తమిళ దర్శక నిర్మాతలు చూడకపోవడంతో తమిళ మీడియాకు హాట్ టాపిక్ గా మారడానికి ఇలా తమన్నా కమల్ రజినీకాంత్ ల రాజకీయ ఐఖ్యతను దృష్టిలో పెట్టుకుని మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇలా కామెంట్ చేసి ఉంటుంది అని అంటున్నారు. వాస్తవానికితమిళనాడులో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న కమల్ రజినీకాంత్ లు కలిసి ఎన్నికలలో పోటీ చేసినా ఏమాత్రం అనుభవం లేని ఈ సూపర్ స్టార్స్ మాటలు విని తమిళ ఓటర్లు వీరికి ఓట్లు వేస్తారు అన్న విషయం పై అనేక సందేహాలు ఉన్నాయి. అయితే తమిళనాడులో ఎన్నికలు రావడానికి ఇంకా ఒక సంవత్సర కాలం పడుతుంది. రాజకీయాలలో ఒక సంవత్సర కాలం అంటే అనేక ఊహించని మార్పులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో కమల్ రజినీకాంత్ ల రాజకీయ స్నేహం చివరి వరకు కొనసాగుతుందా అన్నదే సందేహం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: