ఉత్తర్ ప్రదేశ్ లో ని  ఒక వినియోగదారుల  కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది.  షాకింగ్ గా మారిన ఈ తీర్పును బ్రాండ్లను ప్రమోట్ చేసే సెలబ్రిటీలు.. నటులు అందరు  తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు వస్తున్నాయి కదా అని ఏ బ్రాండ్లకు పడితే ఆ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించటంతో పాటు.. వారిచ్చిన స్క్రిప్టును చదివిస్తున్నారు. కోణదృ ఐతే అందులో ఏమి ఉందొ తెలీకుండా నే బట్టి పట్టేసి చెప్తూ ఉంటారు అల చేస్తే  తిప్పలు తప్పవు  తాజా తీర్పు ను చూస్తే ఇట్టే అర్థమవుతాయి.


యూపీలోని ముజఫర్ నగర్ లోని వినియోగదారుల కోర్టు ఇచ్చిన తీర్పు బ్రాండ్ అంబాసిడర్ లకు   కు కళ్లు తెరిచేలాఉంది వివరాల్లో కి  వెళ్తే . బాలీవుడ్ సీనియర్ నటులైన గోవిందా.. జాకీష్రాప్ లకు వినియోగదారుల కోర్ట్ జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఒక పెయిన్ రిలీఫ్ ఆయిల్ యాడ్ లో నటించినందుకు  గాను కోర్టు వారికి జరిమానా విధించింది. అసలు ఏమి  జరిగిందంటే..

 

2012 జులైలో అభినవ్ అగర్వాల్ అనే లాయర్ తన తండ్రి కోసం ఒక పెయిన్ రిలీఫ్ ఆయిల్ కొన్నారు. దీన్ని కొనుగోలు చేయటానికి కారణం.. ఆ ప్రొడక్ట్ ను బాలీవుడ్ ప్రముఖ నటులు గోవిందా.. జాకీష్రాఫ్ నటించారు .. ఆయిల్ వాడితే ఎలాంటి నొప్పి అయినా పదిహేను రోజుల్లో తగ్గి పోతుందని చెప్పారు దానితో ఆయన  తన తండ్రి కోసం  వెంటనే రూ.3600 ఖర్చు పెట్టి మరీ ఆ ఆయిల్ ను కొనుగోలు చేశారు.

 

అయితే.. ఆ ఆయిల్ ను వాడటం మొదలుపెట్టి పది రోజులు అయినా  ఎలాంటి ఫలితం కనిపించలేదు సదరు లాయర్ కు చిర్రెత్తుకొచ్చింది. ప్రకటనలో పేర్కొన్నట్లుగా ఎలాంటి పలితం రాక పోవటంపై బాధపడ్డాడు ..తన తండ్రి కోసం కొన్న ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఎలాంటి ప్రయోజనం లేక పోవటంతో కంపెనీ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడారు. ఆ బాటిల్ ను వెనక్కి తీసుకొని డబ్బులు ఇస్తానని చెప్పారే కానీవారు మల్లి డబ్బులు తిరిగి ఇవ్వలేదు. 

 

దీంతో ఒళ్లు మండిన లాయర్ వినియోగదారుల కోర్టు ను ఆశ్రయించారు. ప్రముఖ నటులు బ్రాండ్ ను ప్రమోట్ చేయటంతోనే తాను ఆయిల్ కొన్నట్లుగా పేర్కొన్న వాదనతో ఏకీభవించిన కోర్టు.. గోవిందా.. జాకీష్రాఫ్ లకు రూ.20వేలు ఫైన్ వేస్తూ తీర్పునిచ్చింది. అంతేకాదు ఆయిల్ బాటిల్ కోసం చెల్లించిన మొత్తాన్ని.. వడ్డీ తో కలిపి వినియోగదారుడి కి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.  కోర్టు ఖర్చులు.. లాయర్ ఖర్చులు కూడా చెల్లించాలని స్పష్టం చేసింది. సో.. ప్రముఖులు తాము చేసే ఉత్పత్తుల విషయంలో జాగ్రత్త తో  వ్యవహరించాల్సిన అవసరం ఉంది వారు చెప్పారని నమ్మకం తో ఎంతో మంది కొనుగోలు చేస్తూ ఉంటారు 

మరింత సమాచారం తెలుసుకోండి: