సల్మాన్ ఖాన్‌కు జోడీగా ‘వీర్’ సినిమాలో నటించి బాలీవుడ్‌లో అడుగు పెట్టింది జరీన్ ఖాన్. చూడటానికి అచ్చం కత్రినా కైఫ్‌లా ఉందని సల్మాన్ ఈమెకు తన సినిమాలో అవకాశం ఇచ్చారు. కానీ కత్రినా సాధించిన సక్సెస్‌లో సగం కూడా సాధించలేకపోయింది జరీన్ ఖాన్. ఏదో ఒకటిలే అనుకుంటూ వచ్చిన పాత్రలు చేసుకుంటూ పోతోంది. సెక్సువల్ సన్నివేశాలు ఉన్న హేట్ స్టోరీ త్రీ సినిమాలో కూడా తన అందచందాలని పరిచింది కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఇటీవల తెలుగులో విడుదలైన ‘చాణక్య’ సినిమాలో కీలక పాత్ర పోషించింది ఈ హాట్ బ్యూటీ.

 

అయితే తాజాగా జరీన్ లెస్బియన్ సెక్స్ సినిమాలపై దృష్టి పెట్టింది. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడంలో తప్పు లేదని సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి మన అందరికి తెలిసిందే. అలాంటప్పుడు ఇదే కాన్సె్ప్ట్‌తో సినిమాలు ఎందుకు తీయకూడదు అని ఎదురు ప్రశ్న వేస్తుంది.

 

‘ఇక హీరోల పక్కన గ్లామర్ గుప్పించే  పాత్రలు చేయడం నా వల్ల కాదు అంటుంది. అంతకుమించిన ట్యాలెంట్ నాలో ఉందని నిరూపించుకోవాలి  అనుకుంటున్నాను అని చెప్పింది. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే’ సినిమాలో నాకు నచ్చిన పాత్రలే దొరికింది.ఇది స్వలింగ సంపర్కులైన అమ్మాయి, అబ్బాయిల పెళ్లి నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా . ఇది వరకు నేను కేవలం బోల్డ్ సన్నివేశాలకు మాత్రమే పనికొస్తానని అనుకునేవారు. మున్ముందు నాకు మంచి పాత్రలు రాకపోవా అని అలాంటి పాత్రల్లోనే ఎక్కువగా నటించేదాన్ని. కానీ నాకు వేరే ఛాన్సెస్ రాలేదు. అప్పుడే నాకు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.


స్వలింగ సంపర్కులు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది ఈ సినిమా. సాధారణ మనుషుల్లా వారు సమాజంలో జీవించలేకపోతున్నారు. ఇక సెక్సువల్ సన్నివేశాల విషయానికొస్తే అవసరమైతే అమ్మాయిలకు కూడా లిప్ కిస్సెస్ ఇస్తా.  అయితే ఈ సినిమాలో మాత్రం అలాంటి సన్నివేశాల ఏమీ లేవు’ అని వెల్లడించారు. జరీన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 2020 న్యూ ఇయర్‌కు ఆడియన్స్ ముందుకు రాబోతోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: