వెంకటేష్ పవన్ కళ్యాణ్ లు కలసి నటించిన ‘గోపాల గోపాల’ మూవీ రికార్డులను క్రియేట్ చేయలేకపోయినా వెంకటేష్ పవన్  కళ్యాణ్ ల మధ్య మంచి సాన్నిహిత్యాన్ని పెంచింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో పవన్ వెంకటేష్ లు కలిసి అనేక ఆధ్యాత్మిక వేదాంత విషయాలు మాట్లాడుకునే వారని అప్పట్లో వార్తలు వచ్చాయి. 

ఇలాంటి నేపధ్యంలో వచ్చేనెల విడుదలకాబోతున్న ‘వెంకీమామ’ లో పవన్ ‘కాటమరాయుడు’ తరహాలో కొన్ని స్కీన్స్ కనిపిస్తాయి అన్న ప్రచారం జరుగుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో వచ్చే షుమారు 20 నిముషాల సీన్స్ ‘కాటమరాయుడు’ సీన్స్ ను పోలి ఉంటాయి అన్న వార్తలు వస్తున్నాయి. 

వెంకటేష్ నడివయసుకు వచ్చాక అతడికి హీరోయిన్ పరిచయం కావడం అప్పుడు ఆ వయసులో ప్రేమ ఆలోచనలు కలిగి మెలికలు తిరగడం లాంటి సీన్స్ చూసిన వారికి వెంటనే ‘కాటమరాయుడు’ సినిమాలోని పవన్ శృతి హాసన్ ల మధ్య వచ్చిన రొమాంటిక్ సీన్స్ వెంటనే గుర్తుకు వస్తాయి అని అంటున్నారు. అంతేకాదు ‘వెంకీమామ’ లో వెంకటేష్ పాయల్ రాజ్ పుట్ ల మీద తీసిన ఒక పాట కూడ ‘కాటమరాయుడు’ మూవీలోని పవన్ శృతి హాసన్ లపై తీసిన ఒక ఫోక్ సాంగ్ మోడల్ లో కొద్దిగా రొమాంటిక్ గా ఉంటుందని ఈ పాటను ఇప్పటికే చూసిన ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.    

ఇది ఇలా ఉండగా ఈ సినిమాను డిసెంబర్ 13న విడుదల చేయాలి అన్న విషయమై ఇంకా స్థిర నిర్ణయం రాలేదనీ ఆ డేట్ కు బదులు డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు ఇంకా సురేష్ బాబును వదల లేదని టాక్. దీనితో ‘వెంకీమామ’ డేట్ తెలియక డిసెంబర్ లో విడుదల కావలసిన అనేక మీడియం రేంజ్ సినిమాలు తల పట్టుకుంటున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: