చరణ్ జూనియర్ లతో ‘ఆర్ ఆర్ ఆర్’ తీస్తున్న రాజమౌళి టాప్ హీరోలతో మల్టీ స్టారర్ మూవీలను తీసే దర్శకులు అనుసరించే పద్ధతులు విడిచిపెట్టి తన స్టైల్ లో ఒకకొత్త ఒరవడి తీసుకు రావడానికి రాజమౌళి రంగం సిద్ధం చేస్తున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో ఒక అదిరిపోయే డాన్స్ సాంగ్ చరణ్ అలియా భట్ ల మధ్య త్వరలో రాజమౌళి చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈపాటకు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఒకభారీ సెట్ ఇప్పటికే వేసినట్లు తెలుస్తోంది. ఈపాటకు సంబంధించిన డాన్స్ ప్రాక్టీస్ ఇప్పటికే చరణ్ అలియా భట్ లు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఒకప్రముఖ కొరియో గ్రాఫర్ నేతృత్వంలో ఈపాట కోసం చాలకష్టమైన స్టెప్స్ ను క్రియేట్ చేసి చరణ్ అలియా భట్ లకు డాన్స్ ప్రాక్టీస్ చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి చరణ్ తో పోల్చుకుంటే జూనియర్ చాలమంచి డాన్సర్ అయితే జూనియర్ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో పోషిస్తున్న కొమరమ్ భీమ్ పాత్ర చాల సీరియస్ లుక్ లో ఉండే నేపధ్యంలో ఆ పాత్ర స్వభావం చెడిపోకూడదని రాజమౌళి జూనియర్ తో ఇలాంటి పాట తీసే ఆలోచన విరమించుకుని ఈఛాన్స్ చరణ్ కు ఇచ్చినట్లు టాక్. 

ఇప్పుడు ఈవార్త ఇండస్ట్రీ వర్గాల నుండి లీక్ అవ్వడంతో జూనియర్ అభిమానులు రామ్ చరణ్ హైలెట్స్ పై ఈర్ష్య పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభం సమయంలోనే మీడియాతో మాట్లాడుతూ ఈమూవీలో జూనియర్ చరణ్ ల పాత్రలు కనిపిస్తాయి కాని ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అన్న ఫీలింగ్స్ పెట్టుకోవద్దని చరణ్ జూనియర్ అభిమానులకు ముందుగానే సంకేతాలు ఇచ్చాడు. 

ఇది ఇలా ఉండగా ఈమూవీలో ఒలీవియా మోరిస్ పాటు హాలీవుడ్ నటులు స్టీవెన్సన్ అలిసన్ డూడీ లను ఎంపిక చేసిన రాజమౌళి వారి ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ‘ఆర్ ఆర్ ఆర్’ ను కొన్ని అంతర్జాతీయ భాషలలో కూడ డబ్ చేసి విడుదల చేయడానికి కొన్ని ప్రముఖ అంతర్జాతీయ ఫిలిం సంస్థలతో ఇప్పటి నుంచే చర్చలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఈమూవీని మనదేశంలో 10 భాషలలో విడుదల చేయబోతున్నట్లుగా రాజమౌళి సంకేతాలు ఇవ్వడమే కాకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ దక్షిణాది హిందీ భాషలతో పాటు బెంగాలి ఒరియా భాషలలో కూడ ఒకేసారి విడుదల చేయడానికి జక్కన్న అనుసరిస్తున్న వ్యూహాలు పరిశీలిస్తుంటే ‘ఆర్ ఆర్ ఆర్’ రికార్డులు ఏరేంజ్ లో ఉంటాయో ఊహకు అందని విషయంగా మారింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: