మెగా బ్రదర్ నాగబాబు ‘జబర్దస్త్’ షో నుండి బయటకు రావదానికి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారడమే కాకుండా నాగబాబు తీసుకున్న ఈ నిర్ణయం పై అనేక సందేహాలు వ్యక్తం అయ్యాయి. దీనితో ఈ విషయమై అనేక గాసిప్పులు ప్రవచారంలోకి రావడం మొదలుఅయింది. ఈ నేపథ్యంలో  ఈ గాసిప్పులకు చెక్ పెట్టడానికి  నాగబాబు  తన యూట్యూబ్ ఛానలల్ ద్వారా ఒక వీడియోను షేర్ చేసి ‘జబర్దస్త్’ సీక్రెట్స్ బయటపెట్టాడు.  తాను ‘జబర్దస్త్’ షోలో అడుగు పెట్టడానికి ప్రధానకారణం ‘అదుర్స్’ అనే షో అని అంటూ నాగబాబు ఆ షోకి తాను జడ్జ్‌ గా ఉన్న సమయంలో ఏడుకొండలు అనే మేనేజర్ తనకు టచ్‌ లో  ఉండేవాడు అన్న విషయాలను గుర్తుకు చేసుకున్నాడు.  


ఆ తరువాత ఏడుకొండలు రాయ బారంతో తాను నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిని  కలిసిన అప్పటి విషయాలను బయటపెడుతూ అప్పటివరకు  తనకు  మల్లెమాల సంస్థ  శ్యామ్ ప్రసాద్ రెడ్డికి పెద్దాగా పరిచియంలేని విషయాలను తెలియ చేసాడు. మల్లెమాల బ్యానర్ నుంచి ‘అదుర్స్’ తర్వాత ‘జబర్దస్త్’ కామెడీ షో ప్లాన్ చేస్తున్నట్లు శ్యామ్ ప్రసాద్ రెడ్డి తనతో చెప్పడంతో  పాటు దానికి తనను కూడ జడ్జిగా ఉండాలని శ్యామ్  ప్రసాద రెడ్డ్డి కోరిన అప్పటి విషయాలను గుర్తుకు చేసుకుంటూ అయితే ఈ షోని ఇంత లాంగ్ టైమ్  కొనసాగిస్తామని తానుకాని శ్యామ్ ప్రసాద్ రెడ్డికాని భావించలేదు అన్నవిషయాలను నాగబాబు బయటపెట్టాడు. 

వాస్తవానికి ‘జబర్దస్త్‌’ ను కేవలం 25 ఎపిసోడ్స్ కోసమే ప్లాన్ చేసుకున్నారని అయితే  తనతోపాటు రోజాను జడ్జిగా ఉండాలని వారు నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు నాగబాబు. అయితే ఒకవేళ తనకు నచ్చితే 25 ఎపిసోడ్స్ అంతకంటే  ఎక్కువ ఎపిసోడ్స్ చేసేందుకు తాను సిద్దమే అని అప్పట్లో అనుకున్నానని ఆ సమయంలో తాను ‘ప్రజారాజ్యం’ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్లడం మరోవైపు రోజా తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరడం జరిగింది అన్న విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. 

అయితే రోజా తానూ ఇద్దరం ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నాం కాబట్టి ఈ షోలో చేయాలా? వద్దా? అని మొదట ఆలోచించినా పొలిటికల్ విభేదాలు వేరు క్రియేటివ్ ఫీల్డ్ వేరు అని భావించి చివరకు తాను జడ్జిగా ఒప్పుకున్నట్లు వివరిస్తూ ఈషో అద్భుత విజయానికి యాంకర్ అనసూయ సమర్ధత కుడా కలిసి వచ్చ్హింది అంటూ కామెంట్స్ చేసాడు.  ఈ షో మొదటి ఎపిసోడ్ నుండి బెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రావడంతో  తాను ఏడేళ్ల పాటు కంటిన్యూ అయ్యానని అయితే తనకు ఈషో వరసగా చేసి బోరు కొట్టడంతో తాను బయటకు వచ్చాను కానీ తనకు మల్లెమాల సంస్థతో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు అంటూ కామెంట్ చేసాడు. అయితే నాగబాబు తనకు ‘జబర్దస్త్’  షో తనకు రొటీన్ గా మారింది అని కామెంట్ చేయడంతో ఈ షోకు లైఫ్ అయిపోయింది అంటూ పరోక్షంగా నాగబాబు సంకేతాలు ఇచ్చాడ అన్న విశ్లేషణలు కూడ వస్తున్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: