1980 ప్రాంతానికి చెందిన అలనాటి టాప్ హీరోలు టాప్ హీరోయిన్స్ కలిసి ‘రీ యూనియన్’ పేరిట జరుపుకునే పార్టీ ఈసారి ఈ కార్యక్రమం మొదలై 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా చిరంజీవి ఇంటిలో ఏర్పాటు చేసిన ఈ పార్టీ చాల సరదాగా జరిగినట్లు వార్తలు మీడియాలో వస్తున్నాయి. వాస్తవానికి ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగానే మీడియాకు ఈ కార్యక్రమం ఫోటోస్ లీక్ అయ్యాయి.

ఈ కార్యక్రమం అంతా పూర్తి అయిన తరువాత అన్ని ఫోటోలను ఒకేసారి మీడియాకు విడుదల చేద్దామని ఈ కార్యక్రమానికి హాజరైన సెలెబ్రెటీలకు చిరంజీవి సలహాలు ఇచ్చినట్లు టాక్. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన చాలామంది సీనియర్ హీరోయిన్స్ ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమం ఫోటోలను తమ సెల్స్ ద్వారా మీడియాకు లీక్ చేయడంతో చిరంజీవి కూడ వారి అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు అని తెలుస్తోంది. 

దీనికితోడు ఈ కార్యక్రమానికి వచ్చిన సెలెబ్రెటీలు అంతా వారివారి పిల్లలు ఏమి చదువుతున్నారు వారి కెరియర్లు ఎలా ఉన్నాయి అన్న యోగక్షేమాలు తెలుసుకుంటూ ఈ పార్టీకి వచ్చిన కొందరు సెలెబ్రెటీలు హంగామా చేయడమే కాకుండా వారివారి వ్యక్తిగత సమస్యల గురించి తెలుసుకుంటూ తామంతా ఒకటే అన్న సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ పార్టీకి సంబంధించి అన్ని తానే చూసుకున్న రామ్ చరణ్ ప్రేమ పూర్వక ఆతిధ్యానికి అలనాటి హీరోయిన్స్ అంతా షాక్ అవ్వడమే కాకుండా చరణ్ లాంటి మంచి కొడుకు ఉండటం చిరంజీవి అదృష్టం అంటూ ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది.

ఈకార్యక్రమానికి వచ్చిన చాలామంది సెలెబ్రెటీలు చరణ్ కు ఒక మంచి సలహా కూడ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈనాటితరం స్టార్స్ లో ఇగోలు తగ్గి వారి మధ్య స్నేహం పెరగాలి అంటే ఇప్పటి తరం స్టార్స్ తో చరణ్ కూడ ఇలాంటి పార్టీలు సంవత్సరానికి ఒకసారి అయినా చేసే ప్రయత్నం చేయమని సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సూచనకు చరణ్ స్పందిస్తూ 1980 కాలంనాటి తారల్ బాండింగ్ చూస్తుంటే తనకు కూడ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అనిపిస్తోందని తన వంతు ప్రయత్నాలు చేస్తాను అంటూ చరణ్ మాట ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: