తమిళ  హీరో  కార్తి నటించిన  లేటెస్ట్ మూవీ ఖైదీ దీపావళికి  కానుకగా విడుదలై  100కోట్ల గ్రాస్ వసూళ్లను  రాబట్టి  బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.  పెద్దగా అంచనాలు లేకుండా  వచ్చిన ఈ చిత్రం విమర్శకులను  మెప్పించడం తో మొదటి షో నుండే  సూపర్ పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది కానీ  మొదటి రోజు  కలెక్షన్ల  పరంగా నిరాశపరిచింది. అయితే   రివ్యూస్ కు తోడు  మౌత్ టాక్ కూడా  ఎక్స్ట్రాడినరీ గా  ఉండడంతో రెండో రోజు నుండి  బాక్సాఫీస్ వద్ద  సత్తా చాటింది. 
 
 
ఇక  గత కొద్దీ కాలంగా  తమిళ సినిమాలు  తెలుగులో  దారుణంగా  నిరాశ పరచగా ఖైదీ మాత్రం    అన్ని ఏరియాల్లో  బ్రేక్ ఈవెన్ అయ్యి  బయ్యర్లకు  భారీ లాభాలను తీసుకొచ్చింది. ఇక  ఈ సినిమా  థియేట్రికల్ రన్ ముగిసింది. ఓవరాల్ గా ఈ చిత్రం  తెలుగు రాష్ట్రాల్లో 7కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో ఈచిత్రం తెలుగులో కార్తి కెరీర్ లోనే  బిగ్గెస్ట్  హిట్  గా  రికార్డు సృష్టించింది.   గత రెండు సినిమాలతో  నిరాశపరిచిన  కార్తి తాజాగా ఖైదీ సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు.  ఈ సినిమాకు వచ్చిన   రెస్పాన్స్ తో కార్తి నటించిన  తదుపరి చిత్రాలకు  తెలుగులో ఫుల్ డిమాండ్ ఏర్పడింది.  ఇక ఈ చిత్రాన్ని నిన్న  హాట్ స్టార్  లో విడుదలచేశారు.  అయితే  హాట్ స్టార్  వీఐపీ  సబ్ స్క్రిప్షన్ వున్న వారు మాత్రమే  ఈచిత్రాన్ని  వీక్షించవచ్చు.  
 
 
లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని  డ్రీం వారియర్ పిక్చర్స్  పతాకం పై ఎస్ ఆర్ ప్రభు నిర్మించగా  సామ్ సీఎస్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.  తెలుగు లో ఈ చిత్రాన్ని  శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్ విడుదలచేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: