రామ్ గోపాల్ వర్మ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తీసిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వవద్దని కమ్మ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బ తీసేలా ఈ మూవీ ఉందని ఒక ప్రముఖ వ్యాపార వేత్త ఈ సినిమా విడుదలను ఆపుచేయమని తెలంగాణ హైకోర్టులో పిల్ వేయడంతో ఈవిషయమై వర్మ ఎలర్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ కోర్టు కేసులను లెక్కచేయకుండా వర్మ ఈ శుక్రువారమే ఈ సినిమాను విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నా ఈ మూవీకి ఇప్పటి వరకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాలేదని తెలుస్తోంది. ఈ మూవీని సెన్సార్ వర్గాలు ఇప్పటి వరకు చూడకుండా రకరకాల కారణాలు చెపుతూ వాయిదా వేస్తున్న పరిస్థితులలో అసహనానికి లోనవుతున్న వర్మ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సెన్సార్ విధి విధానాల పై ఘాటైన కామెంట్స్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనితో వర్మ మళ్ళీ మీడియా ముందుకు రాబోతు ఉండటంతో ఇప్పుడు ఈ అంశం హాట్ న్యూస్ గా మారే ఆస్కారం ఉంది. 

మూవీ విడుదలకు ఇక కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులలో సెన్సార్ పై వ్యూహాత్మక ఒత్తిడి తీసుకు రావడానికి వర్మ ఇలా ప్రవర్తిస్తున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకర మహోత్సవానికి తాను విజయవాడ వెళ్ళినప్పుడు విజయవాద్ అంతా కడప రెడ్లుతో నిండిపోవడంతో తనకు ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమా తీయాలనే ఆలోచన అప్పుడు కలిగింది అని చెపుతున్న వర్మ మాటలను సెన్సార్ ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి. 

అయితే ఒకసారి వర్మ మీడియా ముందుకు వస్తే చాలు అనేక విషయాలు మాట్లాడుతాడు. దీనితో పైసా ఖర్చు లేకుండా ఈ మూవీకి మరొకసారి ఫ్రీ పబ్లిసిటీ చేసుకునే మాష్టర్ ప్లాన్ వర్మ ఆలోచిస్తున్నాడు అనుకోవాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: