ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై ఇండియ‌న్ సినిమా వ‌ర్గాల్లో ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తెలుగు గ‌డ్డ‌పై ఇద్ద‌రు యోధుల చ‌రిత్ర ఆధారంగా మెయిన్ లైన్ తీసుకుని దానికి ఫిక్ష‌న్ జోడీంచి మ‌రి రాజ‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 

ప్రస్తుతం ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఓ లేటెస్ట్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమా మొదలు పెట్టిన రోజునే విడుదల డేట్ ప్రకటించాడు రాజమౌళి. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి కూడా ఇప్ప‌టికే యేడాది కంప్లీట్ అయ్యింది. ఆ రోజునే రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ ను 2020 జులై 30న రిలీజ్ చేస్తామని చెప్పారు .. కానీ సినిమా విషయంలో ఆలస్యం అవుతుండడంతో విడుదల డేట్ మారే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. 

 

ఇక తాజా అప్‌డేట్ ప్ర‌కారం ఆర్.ఆర్.ఆర్ ను ముందుగా చెప్పిన‌ట్టు జులై 30న కాకుండా అక్టోబర్ 2న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట. షూటింగ్ విష‌యంలో అనుకున్న‌ది అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌క‌పోవ‌డం... ఓ సారి ఎన్టీఆర్ గాయ‌ప‌డ‌డం... ఇటు రామ్‌చ‌ర‌ణ్ సైతం రెండు సార్లు గాయ‌ప‌డ‌డంతో పాటు మ‌ధ్య‌లో సైరా సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం చాలా గ్యాప్ తీసుకోవ‌డంతో ఆర్.ఆర్.ఆర్ అనుకున్న‌ట్టుగా షూటింగ్ జ‌ర‌గ‌లేద‌ని తెలుస్తోంది. 

 

ఇక షూటింగే ఇలా లేట్ అయితే సీజి వ‌ర్క్ మ‌రింత లేట్ అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ లెక్క‌న చూస్తే ముందు అనుకున్న టైంకు సినిమా వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో సినిమాను అక్టోబ‌ర్ 2కు వాయిదా వేసే ఆలోచ‌న‌లో రాజ‌మౌళి ఉన్న‌ట్టు తెలుస్తోంది. రాజమౌళికి హ‌డావ‌విడిగా సినిమా రిలీజ్ చేయ‌డం క‌న్నా ముందుగా ప‌ర్‌ఫెక్ష‌న్ ముఖ్యం. ఇప్పుడు ఈ సినిమాకు కూడా క్వాలిటీ కోసం అదే పంథా ఫాలో అవుతున్నాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: